ఎవరీ మత్తయ్య...ఇతన్ని ఎవరు చంపాలనుకుంటున్నారు? - MicTv.in - Telugu News
mictv telugu

ఎవరీ మత్తయ్య…ఇతన్ని ఎవరు చంపాలనుకుంటున్నారు?

February 23, 2018

ఓటుకు నోటు కేసు సుప్రీంకోర్టులో నడుస్తున్న సమయంలో ఆ కేసులో కీలక నిందితుడు అయిన మత్తయ్య సుప్రీంకోర్ట్ చీఫ్ జస్టిస్‌కి లేఖ రాశాడు. ‘ఓటుకు నోటు కేసులో నేను అప్రూవర్‌గా మారుతా. నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ కేసుకి సంబంధించి దయచేసి నా వాదన కూడా వినండి. టీడీపీ,టీఆర్ఎస్ పార్టీలు వేధిస్తున్నాయి.

ఓటుకు నోటు కేసులో కొన్ని వాస్తవాలు బయటకి చెప్పే అవకాశం నాకు కల్పించి, పౌరులకు ఇచ్చిన రాజ్యాంగ హక్కును కాపాడండి.  నన్ను ఉపయోగించుకొని చంద్రబాబుని ఇరికించాలని చూశారు.  ఓటుకు నోటు కేసుతో నాకు ఏ సంబందం లేదు. క్రిస్టియన్స్ సమస్యల పైనే నేను స్టీఫెన్ సన్‌ని కలిశాను. హైకోర్టులో కేసు ఉన్న సమయంలో టీడీపీ నాకు సహకరించింది.

సుప్రీంకోర్ట్ లో ఎవరు నాకు సహరించలేదు, తను కేటీఆర్ కి ఫోన్ చేసిన సమయంలో ఈకేసులో ఆయన్ని ఇరికించాలని ఏపీ ప్రభుత్వం చూసింది. సీఎం  ఫోన్ ట్యాపింగ్‌లో కొన్ని వాస్తవాలు తెలియాలి’ అని మత్తయ్య ఆ లేఖలో రాశాడు.