ఓట్లు నోట్లు.. నాంపల్లిలో భారీ నగదు పట్టివేత…

ఓటర్లను నగదుతో మురిపించి ఓట్లు దండుకుందామని వివిధ నేతలు వివిధ రకాల జిమ్మిక్కులకు పాల్పడుతూనే వున్నారు. చివరి క్షణం వరకైనా పట్టువదలకుండా దొడ్డిదారినైనా డబ్బు తరలిద్దామని కంకణం కట్టుకున్నట్టే వున్నారు. నగరంలోని కూకట్‌పల్లి బాలాజీ నగర్‌లో ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కార్పోరేషన్ ఛైర్మన్ జూపూడి ప్రభాకర్ రావు‌ ఇంటి వద్ద రూ.17.50 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. అది మరిచిపోక ముందే నగరంలోని బేగంబజార్‌లో భారీగా నగదు పట్టుబడింది. దాదాపు రూ.50 లక్షల నగదును వెస్ట్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్నారు.Telugu news Votes notes .. Nampalli Caught up to rs.50 lakh’s cash …బేగంబజార్‌లోని హవాలా వ్యాపారి నుంచి డబ్బు తీసుకెళ్తుండగా టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. అతను కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థి సర్వే సత్యనారాయణ ప్రధాన అనుచరుడు కాంగ్రెస్ నేత గాలి బాలాజీ అని పోలీసులు తెలిపారు. అతని వద్ద కాంగ్రెస్ ప్రచార సామాగ్రిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఏపీ09 బిఎ4646 నంబర్ గల ఇన్నోవా వాహనంలో సర్వే సత్యనారాయణ కోసం డబ్బులు తీసుకెళ్తుండగా నాంపల్లి దగ్గర పోలీసులు పట్టుకున్నారు. సర్వే ఆదేశాల మేరకే బేగం బజార్‌లోని హవాలా డీలర్  దిలీప్ నుంచి రూ. 50 లక్షలు తీసుకుని బాలాజీ బయలుదేరాడని పోలీసులు తెలిపారు.

హవాలా వ్యాపారి షరీఫ్‌ నాంపల్లి పోలీసుల అదుపులో ఉన్నాడు.