ఏంజెలినాకూ లైంగిక వేధింపులు

లైంగిక వేధింపుల్లో రికార్డు సాధించిన హాలీవుడ్ నిర్మాత వెయిన్‌స్టన్ గురించి మరో ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. పదేళ్ళుగా అనేక లైంగిక వేధింపులకు సంబంధించిన ఆరోపణలు ఎదుర్కొంటూ ఆ సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటున్న ఆయన గురించి మరో షాకింగ్‌ విషయాన్ని ‘ న్యూయార్కర్‌ ’ అనే పత్రిక వెల్లడించింది.

ఈ కీచకుడు ఎంజెలినా జోలీ, గైనత్ పాల్ట్రో వంటి ప్రముఖ హాలీవుడ్ నటీమణులను కూడా వదిలి పెట్టలేదట. నిర్మాతంటే హీరోయిన్లతో పడక సుఖం పొందాలన్నట్టే వ్యవహరించేవాడని సమాచారం.  తాజాగా వారిద్దరు కూడా ఈ విషయాన్ని స్పష్టం చేశారు. వెయిన్‌‌స్టన్‌ సినిమాలో తమ కెరీర్‌ ఆరంభంలో లైంగిక వేధింపులకు పాల్పడ్డారని, లైంగిక వాంఛలు తీర్చాలని వేధించాడని వారు వివరించారు. వారిద్దరి సాక్ష్యంతో అతని మీద జనాల్లో మర్యాద తగ్గిపోయింది.

ఈ విషయం ఇలా వుంటే.. వెయిన్‌స్టన్ పనిచేస్తున్న డెమొక్రటిక్ పార్టీ నుంచి అతనికి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. వెయిన్‌స్టన్‌ ఎప్పటి నుంచో ఈ పార్టీకి పెద్ద విరాళదాత. ఆయనపై వచ్చే ఆరోపణలు కూడా గతంలో డెమొక్రాట్లు కొట్టిపడేసేవారు. అయితే, తాజాగా ఆయన నిజ స్వరూపాన్ని న్యూయార్కర్ పత్రిక మరోసారి ఆధారాలతో సహా వెల్లడించడంతో ఆ పార్టీకి షాక్‌ తగిలింది. అంతేకాకుండా అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా పెద్ద కూతరు మాలియా కూడా ఈయన వద్దే ఇంటర్న్‌షిప్‌ చేస్తోంది. దాదాపు ఎనిమిదిమందిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని గతంలో టైమ్స్‌ వెల్లడించగా ఇప్పుడు ఎంజెలీనా వంటి నటీమణులను కూడా వెయిన్‌స్టన్ వదలలేదని తెలియడం, వారు కూడా ఈ విషయం చెప్పడంతో అతని మీద పార్టీ నుండి, పబ్లిక్ నుండి తీవ్రమైన వ్యతిరేకత ఎదురౌతోంది.  ఈ విషయంపై  పార్టీ నే తహిల్లరీ క్లింటన్‌ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

SHARE