మనసున్న సియం...ఆ బాలుడి కోరిక తీర్చాడు! - MicTv.in - Telugu News
mictv telugu

మనసున్న సియం…ఆ బాలుడి కోరిక తీర్చాడు!

February 17, 2018

జన్యు సంబంధమైన వ్యాధితో ఇంటికే పరిమితమైన వరంగల్‌కు చెందిన విఘ్నేష్ అనే బాలుడి కోరిక ఈరోజు నెరవేరింది.  కేసీఆర్‌ను చూడాలని ఉందని ఆ బాలుడు కలలు కన్నాడు. ఈవిషయాన్ని ఆ పిల్లాడి తల్లిదండ్రులు మీడియాకు చెప్పడంతో  అది కేసీఆర్ చెవిన పడింది. ఈరోజు కేసీఆర్ పుట్టిన రోజు కావడంతో  తనను చూడాలన్న ఆ బాలుడి కోరికను ఆయన నెరవేర్చారు.

ఆ బాలుడిని అతని తల్లిదండ్రులను ప్రగతి భవన్‌కు పిలుపించుకున్నారు కేసీఆర్. ప్రగతిభవన్‌కు వచ్చిన విఘ్నేష్‌ను  ఆప్యాయంగా పలకరించారు. ఆ కుటుంబ యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అంతేకాదు ఆ బాలుడి వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు.

జన్యు సంబంధమైన వ్యాధితో బాధపడుతున్న ఆ పిల్లాడు మూడేళ్లుగా ఇంటికే పరిమితమయ్యాడు. టీవీలో కేసీఆర్ స్పీచ్ లకు,కేసీఆర్ చేస్తున్న పనులకు అభిమానం పెంచుకుని సియంను ఒక్కసారైనా కలవాలని కలలు కన్నాడు. ఈరోజు అది నెరవేరడంతో ఆ బాలుడి ముఖంలో ఆనందం కనిపించింది.