ఆమ్రపాలికి 21 రోజులు సెలవులిచ్చిన ప్రభుత్వం! - MicTv.in - Telugu News
mictv telugu

ఆమ్రపాలికి 21 రోజులు సెలవులిచ్చిన ప్రభుత్వం!

February 7, 2018

వరంగల్ జిల్లా కలెక్టర్ ఆమ్రపాలి  పెళ్లి చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి18న జమ్మూకి  చెందిన ఐపీఎస్ అధికారి సమీర్ శర్మతో అమ్రాపాలి పెళ్లి జరగనుంది. దీనితో రాష్ట్ర ప్రభుత్వం అమ్రపాలికి 21రోజులు సెలవులు ఇస్తున్నట్లు ఉత్వర్వులు జారీ చేసింది.

ఫిబ్రవరి 15 నుండి మార్చి 7 వరకు ఆమ్రపాలి సెలవులో వెళ్లనున్నారు. ఫిబ్రవరి 18న జమ్మూలో పెళ్లి తర్వాత, 22న వరంగల్ లో రిసెప్షన్, 25న హైద్రాబాద్‌లో సన్నిహితుల మధ్య విందు ఉండబోతున్నట్లు సమాచారం. ఫిబ్రవరి 26 నుంచి మార్చి 7 వరకు భర్తతో కలిసి ఆమ్రపాలి  టర్కీ వెళ్లనున్నారు.

ఆమ్రపాలి  సెలవు దినాలు ఖరారు కావడంతో వరంగల్ జిల్లా కలెక్టర్ బాధ్యతను జేసీ ఎస్.దయానంద్‌కు, రూరల్ కలెక్టర్‌గా జేసీ హరితకు బాద్యతలను అప్పగించారు. సెలవులు ముగిసిన తర్వాత ఆమ్రపాలి  మళ్లీ  విధుల్లో చేరతుందని  రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.