వైభవంగా ఆమ్రపాలి పెళ్లి - MicTv.in - Telugu News
mictv telugu

వైభవంగా ఆమ్రపాలి పెళ్లి

February 19, 2018

వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ ఆమ్రపాలి కాటా పెళ్లి జమ్మూకు చెందిన ఐపీఎస్ అధికారి సమీర్ శర్మతో  అంగరంగ వైభంగా జరిగింది. ఆదివారం సాయంత్రం 6:30 గంటకు కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో వీరు  వివాహం బంధంతో ఒకటయ్యారు. ఈ నెల 21 వరకు కలెక్టర్ దంపతులు జమ్మూలోనే ఉంటారు.


ఈ నెల 22న హైదరాబాద్‌కు వస్తారు. 23న వరంగల్ ఆర్బన్ జిల్లా క్యాంపు  కార్యాలయంలో ప్రముఖులకు వివాహ విందు ఏర్పాటు చేశారు.  అలాగే హైదరాబాద్‌లోనూ  కూడా విందు కార్యక్రమం ఏర్పాటు చేయనున్నారు. ఈ నెల 26 నుంచి మార్చి 7 వరకు ఈ నూతన దంపతులు హానిమూన్ కోసం టర్కీకి వెళ్లనున్నారు. పెళ్లి కోసం ఆమ్రపాలి మూడు వారాలు సెలవు పెట్టడం తెలిసిందే.