ఆడోళ్లను శిడాయిస్తే గంతే... మంచిగైంది - MicTv.in - Telugu News
mictv telugu

ఆడోళ్లను శిడాయిస్తే గంతే… మంచిగైంది

November 25, 2017

అయ్యవ్వలు మంచిగ సదువుకోండ్రా  అని కాలేజీలకు వంపిస్తే  బుక్కులను పక్కకు వెట్టి, ఆడోళ్ల  హాస్టళ్ల ముందు, కాలేజీల ముందు  శెక్కర్లు గొట్టుకుంట, సీటీలు కొట్టుకుంట అమ్మాయిలను  ఏడిపిస్తున్న బద్మాష్ గాళ్ల భరతం పట్టిన్రు వరంగల్ షీటీమ్ పోలీసోళ్లు. 11 మంది యువకులను పోలీస్ స్టేషన్కు పట్కపోయి కోదండం ఎక్కిచ్చిన్రు.

అంతేకాదు ఆ పోరగాన్ల అయ్యవ్వలను పిలిపిచ్చి వారి సమక్షంల పోరగాళ్లకు  కౌన్సిలింగ్ ఇచ్చిన్రు. వారిమీద పలు సెక్షన్ల కింద కేసులు నమోదు జేశిన్రు. మల్లా ఆడోళ్లను శిడాయించినట్లు తెలిస్తే నిర్భయ కేసులు వెట్టి  లోపట్కి నూకుతం అని గట్టి వార్నింగులు గుడ ఇచ్చిన్రు వరంగల్ పోలీసులు. ఆడోళ్లను బద్మాశ్ గాళ్లు శిడాయిస్తుండ్రని తెలిస్తే  వాట్సప్ నెం. 9491089257 అనే నంబర్ కు  ఒక్క ఫోన్ గొట్టున్రి, ఆ బద్మాశ్ గాళ్ల భరతం పడ్తం అని పోలీసులు ఈసందర్భంగా వరంగల్ పబ్లిక్ కు వెల్లడించిన్రు.