వర్మ నాకేమన్నా గర్ల్‌ఫ్రెండా బ్రేకప్ అవటానికి ? జేడీ - MicTv.in - Telugu News
mictv telugu

వర్మ నాకేమన్నా గర్ల్‌ఫ్రెండా బ్రేకప్ అవటానికి ? జేడీ

November 27, 2017

గురువును మించిన శిష్యుడు అనిపించుకున్నాడు జెడీ. చక్రవర్తి. నంది అవార్డుల కమిటీ నన్ను గుర్తించకపోవడం చాలా బాధాకరం. 1989 నుండి 2017 వరకు వచ్చిన నంది అవార్డులన్నీ స్టుపిడ్ అవార్డులని అన్నాడు.

ఓ ప్రైవేట్ ఇంటర్వ్యూలో పై విధంగా స్పందించాడు జెడీ. ‘ ‘ గులాబీ ’ సినమా చాలా పెద్ద హిట్టు. కానీ నాకు అవార్డు రాలేదు. ఎవరికొచ్చాయ్.. ఎవరికి రాలేవనేది నాకు అనవసరం.. నన్ను గుర్తించనందుకు, నాకు అవార్డు రానందుకు అవి నాన్‌సెన్స్ అవార్డులే. ఈ అవార్డుల వెనుక రాజకీయాలు వున్నాయా లేదా అన్నది నాకు తెలియదు. ఇది ఎవరినో అవమానించినట్టు అసలూ కాదు. నాకు కత్రినా కైఫ్ అంటే చాలా ఇష్టం. ఆమె నాకు దక్కితే హ్యాప్పీ. దక్కకపోతే నచ్చదు. అలాగని ఆమెని అవమానించినట్టు కాదు కదా. ఇది నా ఫీలింగ్ అని చెప్తున్నానంతే… ’ అంటూ తన గురువు వర్మను తలపించాడు జేడీ.

పవన్ రాజకీయాలపై కూడా స్పందించాడు. ‘ పవన్ సినిమాలకు ఓట్లు రాలవు. ఆయన చేసే సోషల్ ఆక్టివిటీస్ వల్లే అభిమానులు ప్రభావితం అవ్వాలి. పవన్ కళ్యాణ్ సోషల్ యాక్టివిటీస్ చాలా చేస్తున్నారు కాబట్టే ఆయనకు అంత ఫాలోయింగ్ ఉంది ’ అన్నాడు. వర్మకు తనకు బ్రేకప్ అయిందా అనే ప్రశ్నకు ఆయన నాకేమన్నా గర్ల్‌ఫ్రెండా బ్రేకప్ అవటానికి ? నేను ఇతర భాషల్లో సినిమాలు చేస్తూ అక్కడ బిజీగా వున్నాను అంతే. ‘ లక్ష్మీస్ ఎన్టీఆర్ ’ చిత్రంలో తాను చంద్రబాబు పాత్రలో నటిస్తున్నది లేనిది ఇప్పుడే చెప్పలేనని అన్నాడు జేడీ.