హైదరాబాద్ కెప్టెన్సీ నుంచి వార్నర్ ఔట్ - MicTv.in - Telugu News
mictv telugu

హైదరాబాద్ కెప్టెన్సీ నుంచి వార్నర్ ఔట్

March 28, 2018

ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్‌ డేవిడ్ వార్నర్‌కు ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ బుధవారం షాకిచ్చింది. ‘బాల్ ట్యాంపరింగ్’ ఆరోపణలు ఎదుర్కొంటున్న అతణ్ణి తమ జట్టు కెప్టెన్‌ నుంచి తొలగిస్తున్నట్లు యాజమాన్యం ఈ రోజు ప్రకటించింది. కొత్త కెప్టెన్ ఎవరన్నది త్వరలో ప్రకటిస్తామని ఫ్రాంచైజీ సీఈఓ కె.షణ్ముగం తెలిపారు. వార్నర్‌పై క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) తీసుకునే చర్యలను బట్టి తమ తదుపరి నిర్ణయం ఉంటుందని సన్ రైజర్స్ టీమ్ మెంటార్ వీవీఎస్ లక్ష్మణ్ ఇటీవల పేర్కొన్నారు.రాజస్థాన్ రాయల్స్ మేనేజ్‌మెంట్ తమ జట్టు కెప్టెన్సీ నుంచి వార్నర్ సహచరుడు స్మిత్‌ను తొలగించిన విషయం తెలిసిందే. అతను కూడా బాల్ ట్యాపంరింగ్ వ్యవహారంలో ఆరోపణలు ఎదరుకుంటున్నాడు. అతని స్థానంలో అజింక్యా రహానేకు బాధ్యతలు అప్పగించారు. టోర్నీ నిర్వాహకులు, బీసీసీఐ నిర్ణయం మేరకే వారిద్దరికి ఐపీఎల్‌లో ఆడే అవకాశం ఇవ్వాలా వద్దా అనేదాని మీద స్పష్టత వస్తుందని తెలుస్తోంది.