బంగారాన్ని దాచినట్లు.. డ్రమ్ములకు తాళాలు - MicTv.in - Telugu News
mictv telugu

బంగారాన్ని దాచినట్లు.. డ్రమ్ములకు తాళాలు

March 17, 2018

మనం విలువైన వస్తువులను బీరువాల్లో, సూట్ కేసుల్లో పెట్టి తాళం వేసి భద్రపరుస్తాం. కానీ రాజస్థాన్‌లోని గంగాపూర్ సిటీ సమీపంలోని ఉదేయికలా అనే గ్రామంలో ఓ వింత పరిస్థితి ఏర్పడింది. గ్రామంలోని ప్రజలంతా తాగునీటిని వేరేవారు  దొంగతనం చేయకుండా కాపలా కాస్తుంటారు. అందుకోసం నీటి డ్రమ్ములకు తాళాలు వేసి మరి కాపాడుకుంటున్నారు.వేసవి ప్రారంభం కావడంతో ఈ గ్రామంలో ఇప్పటికే  నీటి సమస్య తీవ్రంగా ఉంది. స్థానికులంతా కలిసి నీటి ఎద్దడి గురించి అధికారులకు ఎన్నిసార్లు  విన్నవించకున్నా ఫలితం లేకుండా పోయింది. దాంతో ఆ గ్రామానికి వచ్చే అరకొర నీటిని డ్రమ్ముల్లో నింపుకుని వాటికి తాళాలు బిగించి వేసి మరి కాపాడుకుంటున్నారు. ఉదేయికలాలో రోజుకు పది నిమిషాలు మాత్రమే నీటిని విడుదల చేస్తారు. ఆ సమయంలో గ్రామస్థులంతా తమతమ పంపుల వద్ద ఒక్క నీటిబోట్టు కూడా  వృథాకాకుండా ఒడిసి పట్టుకుని బంగారంలా దాచుకుంటున్నారు.