ఈ యాప్స్ మనతో నీళ్లు తాగిస్తాయి ! - MicTv.in - Telugu News
mictv telugu

ఈ యాప్స్ మనతో నీళ్లు తాగిస్తాయి !

March 14, 2018

మంచినీళ్లు ఎంత తాగితే ఆరోగ్యానికి అంత మంచిది అని అంటారు. మన శరీరానికి  రోజుకు 8 నుంచి 10 గ్లాసుల నీళ్లు తాగితే మంచిది. కానీ మనం రోజుకు ఎన్ని గ్లాసుల నీళ్లు తాగామో మనకెవరికీ  గుర్తుండదు. కానీ మనకు మన మొబైలే ఫలానా సమయానికి మీరు నీళ్లు తాగాలి అని గుర్తు చేస్తే ఎలా ఉంటుంది. అదే ఆలోచనలతో కొన్ని యాప్‌‌లను  రూపొందించారు.

హైడ్రో కోచ్ యాప్ .

Image result for హైడ్రో కోచ్ యాప్ .

శరీరానికి ఎంత నీరు అవసరం, ఉదయం నుంచి ఎన్ని నీళ్లు తాగారు అనే ఖచ్చితమైన లెక్కలు తీసి చూపిస్తుంది ఈ యాప్. వయసును బట్టి, ఆడ, మగ లింగ భేదాన్ని బట్టి ఎవరికి ఎంత వాటర్ అవసరమో నోటీస్ చేస్తుంది. గూగుల్ ప్లేస్టోర్‌లో ఈ యాప్‌ను ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ప్లాంట్ నానీ..

Image result for ప్లాంట్ నానీ..

ఈ యాప్‌లో ఉండే చిన్న చిన్న మొక్కలు మీరు నీరు తాగాల్సిన సమయం కాగానే  అలారం వచ్చి మాకు దాహంగా ఉంది నీరు పోయండి అని అడుగుతాయి. మీరు ఒక్క గ్లాసు వాటర్ తాగి ఈ యాప్‌లో రిజిష్టర్ చేసుకుంటే సాయంత్రానికల్లా ఆ మొక్క పెరిగి చెట్టవుతుంది. ఇంట్రెస్టింగ్‌గా ఉన్న ఈ యాప్ గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

వాటర్ లాగ్డ్

Image result for Water lagged app

ఈయాప్ నీళ్లు  తాగాల్సిన సమయం   అయిందని గుర్తు చేస్తుంది.  మర్చిపోయే సమస్యలేదు. కాకపోతే మీరు నీళ్లు తాగిన ప్రతీసారి ఇందులో డిపాజిట్ చేయాలన్నమాట. ఇది మీరు నీళ్లు తాగి ఎంతసేపవుతుందో అని కూడా రిమైండ్ చేసి నోటీస్ చేస్తుంది. మీరు ఒక రోజులో తాగిన మంచినీళ్ల శాతాన్ని గ్రాఫ్ రూపంలో చూపిస్తుంది. నీళ్లు తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలుంటాయో ఈ యాప్ చెప్తుంది. అంతేకాదు మీ శరీరానికి ఎంత నీరు కావాలి. మీరు ఇప్పటి వరకు ఎంత తాగారు అనే విషయాన్ని కూడా డిస్‌ప్లే చేస్తుంది. గూగుల్ ప్లేస్టోర్‌లో ఈ యాప్ ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఇది అసలే ఎండాకాలం దాహం వేసినప్పుడల్లా మర్చిపోకుండా నీళ్లు తాగండి. వర్క్ బిజీలో పడిపోయి మర్చిపోతే ఈ యాప్‌ను డౌన్ లోడ్ చేస్కోండి. ఖచ్చితంగా అవే మీ చేత నీళ్లు తాగిస్తాయి.