mictv telugu

1.3 లక్షల ఖాతాలను బ్యాన్ చేసిన వాట్సాప్‌

January 10, 2019

చేతిలో వాట్సాప్, ఎఫ్‌బీ వున్నాయి కదా అని ఏది పడితే అది ఫార్వార్డ్ చేయడం ఇకనుంచి కుదరదు. అలా చేస్తే వాటిల్లో తమ ఖాతా తొలగిపోతుంది. ఈ నేపథ్యంలో వాట్సాప్ అడుగు ముందుకేసింది. ఏకంగా 1.3 లక్షల ఖాతాలను వాట్సాప్‌ తొలగించింది. బాలల అశ్లీల చిత్రాలను పంచుకున్నందుకు ఈపని చేసింది. భారత్‌తో పాటు, వివిధ దేశాల్లో భద్రతా సంస్థలు, స్వచ్ఛంద సంస్థల అభ్యర్థనల మేరకు చర్యలు తీసుకున్నట్టు వెల్లడించింది.Telugu news WATSAP banned 1.3 lakh accountsచాలావరకు వాట్సాప్‌ సందేశాల్లో ఎన్‌క్రిప్షన్‌ విధానం కారణంగా వాటిలో ఏముందో గుర్తించడం మూడో వ్యక్తికి కుదరదు. అయితే వినియోగదారుల ప్రొఫైల్‌ ఫోటోలు,  గ్రూప్‌ ప్రొఫైల్‌ ఫోటోలు, గ్రూప్‌లకు సంబంధించిన ఇతర సమాచారం ఎన్‌క్రిప్ట్‌ కానందున వాట్సాప్‌ను దుర్వినియోగం చేస్తున్నవారిని గుర్తించింది.

ఈ క్రమంలోనే ఏరివేతకు పూనుకుంది. ఇదిలా వుండగా గూగుల్ సైతం, ప్లేస్టోర్‌ నుంచి 85 ప్రమాదకర ఆండ్రాయిడ్‌ యాప్‌లను ఇటీవల తొలగించింది. టీవీ రిమోట్‌ కంట్రోల్‌, గేమ్స్‌ పేర్లతో వీటిని దుండగులు ప్లేస్టోర్‌లో పెట్టారు. పైకి కనిపించినంత మంచి యాప్స్ కావంటోంది గూగుల్. ఇలాంటి యాప్‌ల వల్ల వినియోగదారుడి ఫోన్ డేటా మొత్తం హ్యాకర్ల చేతికి వెళ్లిపోతుంది. ఫేక్ అకౌంట్లను తొలగిస్తున్నట్టు ఫేస్‌బుక్‌ కూడా ప్రకటించింది. కానీ అదింకా పూర్తిగా కార్యరూపం దాల్చలేదు. చాలా ఫేక్ అకౌంట్లు ఎఫ్‌బీలో వున్నాయి.. వాటిని కూడా ఎఫ్‌బీ తొలగిస్తే బాగుంటుందంటున్నారు యూజర్లు.