మమ్మల్ని అనే అర్హత కేటీఆర్‌కు లేదు - MicTv.in - Telugu News
mictv telugu

మమ్మల్ని అనే అర్హత కేటీఆర్‌కు లేదు

March 8, 2018

కేటీఆర్‌‌కు మమ్మల్ని అనేంత స్థాయి, అర్హత, పరిపక్వత లేవు అని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ప్రజాచైతన్య బస్సు యాత్రలో భాగంగా బుధవారం వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామివారి ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం సిరిసిల్లలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. తన భార్య పద్మావతి ఎమ్మెల్యేగా ప్రాతినిత్యం వహిస్తున్న కోదాడలో మంత్రి కేటీఆర్‌ తనపై బురదజల్లే ప్రయత్నం చేశారన్నారు.‘ మిషన్‌ భగీరథను కమీషన్‌ భగీరథగా మార్చారు. ఆంధ్రా గుత్తేదార్ల వద్ద 6 శాతం కమీషన్లు తీసుకున్న చరిత్ర టీఆర్ఎస్ ప్రభుత్వానిది. అలాంటివారికి మమ్మల్ని విమర్శించే స్థాయి లేదని కేటీఆర్ తెలుసుకుంటే మంచిది. ప్రజల దృష్టిని మరల్చేందుకే సీఎం కేసీఆర్‌ మూడో కూటమి పేరిట కొత్త నాటకాన్ని తెరమీదకు తెచ్చారు.నేరెళ్ల దళితులపై జరిగిన దాడి ప్రభుత్వ నిరంకుశ పాలనకు నిదర్శనం ’ అని విరుచుకుపడ్డారు.ఇదిలా వుండగా తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ చేపట్టిన తొలి విడత ప్రజా చైతన్య బస్సు యాత్ర నేటితో పూర్తి కానుంది. మార్చి 9వ తేదీ వరకు యాత్ర కొనసాగాల్సి ఉన్నా..అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల నేపథ్యంలో 8వ తేదీతోనే యాత్రను ముగించాలని తాజాగా నిర్ణయించారు.