జయలలిత వల్లే మాకు కష్టాలు - MicTv.in - Telugu News
mictv telugu

జయలలిత వల్లే మాకు కష్టాలు

November 20, 2017

జయలలిత మరణం తర్వాతే మా కుటుంబానికి తీవ్రమైన కష్టాలు ఎదురవుతున్నాయన ’ శశికళ సోదరుడు, ‘మన్నార్‌గుడి మాఫియా’లో ఒకరైన దివాకరన్ వ్యాఖ్యానించారు. తన మరణం తర్వాత నా మీద ఆధారపడ్డ వీళ్ళ పరిస్థితి ఏం కావాలని ఒక్క క్షణం అమ్మ ఆలోచించుంటే ఇవాళ ఈ పరిస్థితి దాపురించి వుండేది కాదు.

ముమ్మాటికి జయలలిత తప్పిదాలే మా కుటుంబానికి శాపాలైనాయి. శశికళను బాగా వాడుకున్న జయ ఆమె క్షేమం కోరి ఏమీ చెయ్యలేదు.. పైపెచ్చు ఇలా అభాసుపాలు చేసి వెళ్ళిపోయింది. చస్తూ తన దారి తాను చూసుకున్నది గానీ తన మీద ఆధారపడ్డ వారి గురించి ఒక్కసారి కూడా ఆలోచించలేకపోయింది ’ అన్నాడు.

కాగా  శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్ కూడా ఇదే విధమైన ఆరోపణలు చేయడం గమనార్హం. అక్రమాస్తుల కేసులో ప్రధాన ముద్దాయి అమ్మే.   అమ్మతో కలిసున్న కారణంతోనే సుధాకరన్‌లు, ఇళవరసి, శశికళలు జైల్లో ఊచలు లెక్కబెట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.

శశికళ కుటింబీకులు చేసిన మోసం వల్లే అమ్మపై కేసులు నమోదయ్యాయని వస్తున్న ఆరోపణలను మీడియా ప్రశ్నించగా.. దాన్ని దినకరన్ కొట్టి పారేశారు. ‘ మేము అమ్మను మోసం చేస్తే ఆమె దోషిగా ఎలా తేలిందని ? ఆమే అసలైన అపరాధి అని అందరికీ తెలుసు  ’ అని  ప్రశ్నించారు.