ఇవాంకకు పోచంపల్లి చీర .. మోడీకి చేనేత బట్టలు - MicTv.in - Telugu News
mictv telugu

ఇవాంకకు పోచంపల్లి చీర .. మోడీకి చేనేత బట్టలు

November 23, 2017

అమెరికా తెల్లపిల్లకు తెలంగాణ ప్రభుత్వం ఆడపడుచు చీర పెడుతున్నది. సారెలో పోచంపల్లి పట్టు చీరె. చీరెతో పాటు డైమండ్ నెక్లెస్ కూడా పెడుతున్నది. ఈ నెల 28న హైదరాబాదులో జరగనున్న ప్రపంచ పెట్టుబడిదారుల శిఖరాగ్ర సదస్సుకు హజరవుతున్న ఇవాంకా ట్రంప్‌కు తెలంగాణ ప్రభుత్వం ఆడపిల్లకిస్తున్న గౌరవమన్నమాట. చేనేత వస్త్రాలకు అంతర్జాతీయ ఖ్యాతి, ప్రాచుర్యం తీసుకు రావాలనే వుద్దేశంతో ప్రధాని నరేంద్ర మోదీకి చేనేత కుర్తా, పైజామా బహుమానంగా ఇవ్వనున్నట్లు సమాచారం. అలాగే సదస్సుకు హాజరయ్యే పారిశ్రమిక వేత్తలందరికీ పోచంపల్లి, చేనేత వస్త్రాలు బహూకరించనున్నారు.200 మంది మహిళా వలంటీర్లు సైతం పోచంపల్లి కాటన్‌ చీరలు ధరించనుండటం విశేషం. ఇందుకోసం పోచంపల్లిలో 200 ‘ టెస్కో’ రకం పట్టుచీరలను ప్రత్యేకంగా తయారు చేయించారు. సదస్సుకు హాజరయ్యే ఈ విశిష్ఠ అతిథులకు ఈ నెల 28న చారిత్రాత్మక ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ప్రధాని నరేంద్ర మోదీ, 29న రాష్ట్ర ప్రభుత్వం తరుపున సీఎం కేసీఆర్‌ గోల్కొండ కోటలో విందు ఇవ్వనున్నారు.