నువ్వు హీరోయిన్‌వు ఎలా అయ్యావో మాకు తెలుసు.. - MicTv.in - Telugu News
mictv telugu

నువ్వు హీరోయిన్‌వు ఎలా అయ్యావో మాకు తెలుసు..

December 13, 2017

‘ నువ్వు ఎట్లా  హీరోయిన్‌వు అయ్యావో మాకు తెలియదా ? అనవసరంగా మెగా ఫ్యామిలీ గురించి మాట్లాడి నీ పరువు తీసుకోవద్దు. కల్యాణ్ బాబును వాడూ వీడూ అనడం తగ్గించుకో.. ’ అంటూ పవన్ కల్యాణ్‌ తరపున వకాల్తా పుచ్చుకొన్న నిర్మాత బండ్ల గణేష్‌, వైసీపీ ఎమ్మెల్యే రోజాపై విరుచుకుపడ్డాడు.

వారి మధ్య మాటల మంటలు రేగాయి.  ఇద్దరూ పరస్ఫరం బూతులు తిట్టుకునే స్థాయికి వెళ్ళారు.  వారసత్వ రాజకీయాల మీద ఓ ప్రైవేట్ టీవీ ఛానల్ నిర్వహించిన కార్యక్రమంలో వారిరువురూ తిట్ల దండకాలతో చెలరేగిపోయారు. చిరంజీవి సపోర్ట్ లేకపోతే పవన్ కల్యాణ్ అనేవాడు లేనేలేడు అన్న రోజా వ్యాఖ్యలపై గణేష్ పైవిధంగా స్పందించాడు.తొలుత వారి మధ్య చర్చ మర్యాద పూర్వకంగానే సాగింది. ‘ రెండుసార్లు ఎమ్మేల్యేగా పోటీ చేసి ఓడిపోయారు.. ఒకసారి గెలిచారు. మీది గోల్డెన్ లెగ్. ఎప్పుడూ జగన్ వెంటే వుండి ఆయనను గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాజశేఖర్ రెడ్డిని పైకి పంపించిన ఐరన్ లెగ్, మహాతల్లి మీరు ’ అంటూ వ్యంగ్యంగా మాట్లాడాడు. దీంతో అగ్గిమీద గుగ్గిలమయ్యారు రోజా. అప్పుడే వారి మధ్య వాగ్వాదం ముదురు దశకు చేరుకున్నది.

‘ పాలిటిక్స్‌లోకి వస్తే ఇలాగే  ఉంటుంది.  గెలిచినా, ఓడినా ప్రజల్లో ఉంటూ కష్టపడుతున్నాం. మీరేమి, నాకు సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదు.. పాయింట్ మీద మాట్లాడండి.. ’ అంటూ  సమాధానం చెప్పారు రోజా.  చివరికి శృతి మించి ఒకర్నొకరు పళ్లు రాలగొడతామన్నంత వరకు వెళ్ళారు. దీంతో ఛానల్ రోజా కాల్‌ను కట్ చేసింది.