ఎవరు హోదా ఇస్తే వారికి మద్దతు.. జగన్ - MicTv.in - Telugu News
mictv telugu

ఎవరు హోదా ఇస్తే వారికి మద్దతు.. జగన్

March 8, 2018

నాలుగేళ్లుగా అడ్డగోలుగా అవినీతికి పాల్పడుతున్న సీఎం చంద్రబాబని.. తన అవినీతి సొమ్ముతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ, ఆడియో, వీడియో టేపులతో అడ్డంగా దొరికిపోయిన ఏకైక సీఎం ఆయనే అని వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు.  ఈ రోజు పొద్దున ఆయన ప్రకాశం జిల్లా సంతరావూరులో మీడియాతో మాట్లాడుతూ.. ‘ ఆంధ్ర రాష్ట్ర మేలు కోరుతూ పార్టీలకు అతీతంగా ప్రత్యేకహోదాపై సంతకం పెట్టిన పార్టీకి మేం కచ్చితంగా మద్దతు ఇస్తాం. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో వుంటుందన్నది మాకు ముఖ్యం కాదు. విభజనతో నష్టపోయిన ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు అన్ని విభజన హామీలనూ అమలు జరపాలన్నదే మా డిమాండ్. ఈ విషయంలో ఫస్ట్ ఫైలా, సెకెండ్ ఫైలా అనే తారతమ్యం లేకుండా నువ్వు పెట్టు నేను ఇస్తా.. ’ అన్నారు జగన్.థర్డ్‌ఫ్రంట్‌లో మీరు చేరుతారా అన్న మీడియా ప్రశ్నపై స్పందిస్తూ.. ఇప్పుడప్పుడే దాని మీద స్పందించడం సరికాదన్నారు. ఎన్నికలు దగ్గర పడ్డాక అప్పుడు ఏ పార్టీతో జతకట్టాలో చెప్తామన్నారు. అవతలి వ్యక్తి ఏం చేసినా వాళ్ళ మీద బండలు వేయటం, బురద చల్లటం చంద్రబాబుకు అలవాటే అన్నారు.