వాతావరణంపై లొల్లి - MicTv.in - Telugu News
mictv telugu

వాతావరణంపై లొల్లి

October 26, 2017

వాతావరణ శాఖ హెచ్చరికల్లో ఎంత నిజం ఉంటుందో మనందరికి తెలిసిన విషయమే. ఈరోజు ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం పడుతుంది  అని చెప్తారు. కనీ కండ్లు కాయలు గాసేలా ఎదురు చూసినా, చుక్క వాన వడది. ఈరోజు వర్షం పడదు బేషుగ్గా వడియాలు ఎండబెట్టుకోవచ్చు అని చెప్తారు, వాళ్లిలా చెబుతారో లేదో కుండపోత వాన కురుస్తనే ఉంటది.

అగో గంత నిక్కంగ జెప్తరు వాతావరణ శాఖాళ్లు. అయితే తాజాగా అంతరిక్ష పరిశోధనా సంస్థపై, భారత వాతారవరణ శాఖ  ఉరుములతో,మెరుపులతో కూడిన ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఎందుకంటే వాళ్లు చెప్పాల్సిన వాతావరణ విశేషాలను అన్ని తప్పు,తప్పులుగా ఇస్రో చెప్తుందట. ‘అట్ల కాకుంట ఆ సమాచారం ఏంటిదో మాకు పంపిస్తే, అన్ల నిజమేంది, ఉరుములు, మెరుపులు ఉన్నయా? వాన పడ్తదా, ఎండ కొడ్తదా అన్నింటిని, ఒకటికి రెండు సార్లు పరిశీలించి జనాలకు చెబుతాం’ అని అంటున్నారు వాతావరణ శాఖోళ్లు. అంతే కాదు  నవంబర్‌లో మూడు తుపాన్లు వస్తాయంటూ ఇస్రో చెప్పింది, ఎహే అంత ఉత్త ముచ్చట అని వాతావరణ శాఖ దానిని తప్పుబట్టింది. కనీ ప్రకృతిల ఎప్పుడు ఏం జరుగుతుందో ఖచ్చితంగా అంచనా వేయడం ఎవరి వల్లా కాదనేది  అక్షర సత్యం.