ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానున్న నితిన్ కొత్త సినిమా ‘ ఛల్ మోహన రంగ ’ సినిమా టీజర్ విడుదలైంది. ప్రేమికుల రోజు సందర్భంగా విడుదలైన టీజర్‌కు మంచి స్పందన వస్తోంది. ‘నీకేంటి భయ్యా ’ అని నితిన్‌ను స్నేహితుడు అడగ్గా ‘ వర్షకాలంలో కలుసుకున్న మేం.. శీతాకాలంలో ప్రేమించుకున్నాం.. వేసవికాలంలో విడిపోయాం ’ అంటూ సమాధానం ఇస్తాడు నితిన్. ‘ మీరిద్దరూ వెదర్ రిపోర్టర్సా భయ్యా ’ అని అవతలి వ్యక్తి అనటంతో నితిన్ అతణ్ణి తిట్టడం చాలా తమాషాగా వుంటుంది.
కృష్ణ చైతన్య దర్శకత్వంలో ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ కథను అందిస్తున్నారు. ఈ సినిమాను శ్రేష్ఠామూవీస్, పవన్‌కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నితిన్ నటిస్తున్న 25వ చిత్రమిది. కుటంబ నేపథ్యంలో సాగే ప్రేమకథా చిత్రంగా దర్శకుడు కృష్ణ చైతన్య దీన్ని తీర్చిదిద్దుతున్నారు. తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు.