సిమెంట్ బస్తాలతో పెళ్లిగౌను కుట్టింది - MicTv.in - Telugu News
mictv telugu

సిమెంట్ బస్తాలతో పెళ్లిగౌను కుట్టింది

September 30, 2018

కొందరు రొటీన్‌కి భిన్నమైన పనులు చేసి ఆశ్చర్యానికి గురి చేస్తారు. ఔరా అనిపిస్తారు. అలాంటి వెరైటీ పనులకు పెళ్ళిళ్ళకు అప్లై చేస్తుంటారు కొందరు. ఈమధ్య పెళ్ళిళ్ళు చేసుకోవడం కూడా ఫ్యాషన్ అయిపోయింది. పెళ్ళిని పదికాలాల పాటు గుర్తుంచుకోవడానికి పెళ్లిలో వేసుకునే గౌను విషయంలో కొందరు వెరైటీలు ప్రదర్శిస్తుంటారు. ఈ క్రమంలో ఓ మహిళ పెళ్లి గౌనును ఎవరూ ఊహించని విధంగా తయారు చేసింది. తన పెళ్లి అప్పుడు కుదరని  ముచ్చటను ఇప్పుడిలా తీర్చుకుంది. అది కూడా బట్టతో కాకుండా సిమెంట్ బస్తాలతో తయారుచేసి ఆశ్చర్యానికి గురి చేసింది.

చైనాలోని ఓ మహిళా రైతు ఈ సిమెంట్ బస్తాల పెళ్లి గౌనును తయారుచేసింది. ఆమె పేరు లిలీతాన్‌. గంగ్సూ ప్రావిన్స్‌లో ఓ కుగ్రామంలో నివాసం వుంటోంది. ప్రతిరోజూ ఆమె పొలం  పనులు చూసుకుంటూ జీవనం గడుపుతోంది. ఈ క్రమంలో ఓరోజు వర్షం బాగా పడుతుండటంతో ఆరోజు పొలానికి వెళ్ళలేకపోయింది. ఇంట్లో ఖాళీగా వుండలేక ఏం చెయ్యాలా అని ఆలోచించింది. ఇంతలో ఆమె బుర్రలోకి ఎప్పుడో ఓ మ్యాగజైన్‌లో చూసిన అందమైన గౌను ప్రకటనను గుర్తు తెచ్చుకుంది. వెంటనే దాన్ని అమలు చెయ్యటానికి పూనుకుంది.

The wedding gown with cement bags

ఇంట్లో ఉన్న 40 సిమెంట్‌ బస్తాలను తీసుకుంది. చకచక తనకు కావల్సిన రీతిలో కట్ చేసుకుంది. 3 గంటల్లోనే అచ్చం అలాంటి వెడ్డింగ్‌ గౌనును కుట్టేసింది. కుట్టడం అయిపోయాక దాన్ని వేసుకుని ఓ ఫోటో దిగింది. సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసింది. దీంతో ఆ ఫోటో కాస్త వైరల్ అయింది. 2012లో వివాహం చేసుకున్న తాను, ఈ గౌనును తమ పెళ్లిరోజైనా వేసుకుంటే బాగుంటుంది అని కామెంట్లు చేస్తున్నారు.