ఆఫీసులో లేడీ బాస్ స్టెప్పులు..వీడియో వైరల్ - MicTv.in - Telugu News
mictv telugu

ఆఫీసులో లేడీ బాస్ స్టెప్పులు..వీడియో వైరల్

February 21, 2020

Welspun India CEO Dipali Goenka dancing video goes viral

కార్పొరేట్ ఆఫీసులో సీఈఓ అంటే ఉద్యోగుల్లో టెన్షన్ ఉంటుంది. అందులోను లేడీ బాస్ అంటే టెన్షన్ రెట్టింపు అవుతుంది. కానీ, వెల్‌స్పన్ ఇండియా సీఈవో దీపాలి గోయెంకా అందుకు విరుద్ధం.  తనతో పాటు పనిచేసే ఉద్యోగులను ఎంతో బాగా చూసుకుంటారు. చిన్నా పెద్దా అని తేడా లేకుండా వాళ్ళతో మమేకమవుతూ, ఒత్తిడి తెలియకుండా చేస్తుంటారు. 

తాజాగా తోటి ఉద్యోగులతో కలిసి దీపాలి చేసిన డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రభుదేవా నటించిన ప్రేమికుడు సినిమాలోని ‘ముక్కాలా ముక్కాబులా’ సాంగ్‌కు ఆమె ఆఫీసులో స్టెప్పులేస్తూ సందడి చేశారు. ఆమెతో పాటు ఉద్యోగులు కూడా డాన్స్ చేశారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో షేర్ అయ్యింది. ఇక ఈ వీడియోపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.