పింఛన్ కోసం ఫ్రిజ్‌లో తల్లి శవాన్ని.. - MicTv.in - Telugu News
mictv telugu

పింఛన్ కోసం ఫ్రిజ్‌లో తల్లి శవాన్ని..

April 5, 2018

మానవత్వం మంటగలసిపోతోంది. తల్లికి వచ్చే పింఛన్ కోసం ఓ కొడుకు కక్కుర్తి పడ్డాడు. అనారోగ్యంతో చనిపోయిన  తల్లి శవానికి అంత్యక్రియలు చేయకుండా రెండేళ్ల నుంచి ఫ్రిజ్‌లో దాస్తున్నాడు. ఆమె చేతి వేలి ముద్రల సాయంతో ప్రతినెలా తల్లి వచ్చే పింఛన్ తీసుకుంటున్నాడు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్  రాజధాని కోల్‌కతాలోని బెహాలా ప్రాంతంలో జరిగింది.బీనా మజుందార్ 70 ఏళ్ల ఎఫ్‌సీఐ విశ్రాంత ఉద్యోగిని. నెలకు రూ. 50 వేల పింఛను వచ్చేది. ఆమెకు భర్త గోపాల్ ఉన్నాడు.  రెండేళ్ల క్రితం బీనా అనారోగ్యంతో మృతిచెందింది. కొడుకు సువవ్రత అంత్యక్రియలు జరపలేదు. మృతదేహం చెడిపోకుండా రసాయనాలు ఉపయోగించి  ఫ్రిజ్‌లో దాచిపెట్టాడు. బీనా ఎక్కడికెళ్లందనే అనుమానంతో స్థానికులు ఆరా తీశారు. కొడుకుపైనే అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు.  పోలీసులు సువవ్రతా ఇంట్లో తనిఖీలు చేయగా గుట్టురట్టయింది. సువవ్రతా ఇంటిలో ఫోర్జరీ చేసిన కొన్ని పత్రాలు కన్పించాయి. బీనా మరణించిన నాటి నుంచి ఆమె వేలి ముద్రలు తీసుకుని గత రెండేళ్లుగా సువవ్రతా నెలకు రూ. 50 వేల  పింఛను తీసుకున్నట్టుగా ప్రాథమిక విచారణలో తేలింది.

మృతదేహాన్ని భద్రపరిచిన విషయం తనకు తెలిసినప్పటికీ పోలీసులకు చెప్పలేదని బీనా భర్త గోపాల్‌ విచారణలో అంగీకరించాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు.