వాటి మధ్య లింకు పెట్టను - MicTv.in - Telugu News
mictv telugu

వాటి మధ్య లింకు పెట్టను

October 25, 2017

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన ఫోన్ నంబర్‌కు ఆధార్ నంబరును అనుసంధానం చేసే ప్రసక్తే లేదని సృష్టం చేశారు. ఈ రోజు ఆమె కోల్‌కతాలో మాట్లాడారు. ‘నేను ఆ రెండింటిని అనుసంధానం చేయను. అ శిక్షగా వాళ్లు నా ఫోన్ నంబరును రద్దు చేసినా నాకే సమస్యా లేదు’ అని చెప్పారు. వచ్చే నెల 8న నోట్ల రద్దుకు వ్యతిరేకంగా బ్లాక్ డే నిర్వహిస్తున్నట్టు, ఆ రోజున రాష్ట్రమంతటా నల్ల జెండాలతో నిరసన చేపట్టనున్నట్లు అమె తెలిపారు.

ఫోన్ నంబర్‌కు ఆధార్‌ను అనుసంధానం చేయాలన్న అంశంపై వేసిన కేసులను సుఫ్రీంకోర్టు ఈ నెల 30వ తేదిన విచారించనుంది. వివిధ సేవలను పొందేందుకు ఆధార్ తప్పనిసరి అన్న నిబంధనను వ్యతిరేకిస్తూ దాఖలైన వేర్వేరు అభ్యర్థనలను సుప్రీం  విచారించనుంది.