కొడుకు తప్పు చేసినందుకు తండ్రికి శిక్ష - MicTv.in - Telugu News
mictv telugu

కొడుకు తప్పు చేసినందుకు తండ్రికి శిక్ష

April 5, 2018

కొడుకు పున్నామ నరకం నుంచి కాపాడుతాడు అని అంటుంటారు. కానీ ఓ కొడుకు ఆ నరకం నుంచి కాపాడ్డం సంగతేమోకాని ఘోర అవమానానికి గురిచేశాడు. దీంతో తండ్రి  ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా టి.నర్సాపురం మండలం సాయంపాలెంలో చోటు చేసుకుంది.సంజీవ కొడుకు నాగేంద్ర గ్రామంలోని ఓ యువతిని  వేధించాడు. దీంతో యువతి తల్లిదండ్రులు నాగేంద్రపై పంచాయితీ పెట్టించారు. పంచాయితికి నాగేంద్ర రాకపోవడంతో తండ్రి సంజీవను పిలిపించి చెట్టుకు కట్టేశారు.  సంజీవను గ్రామపెద్దలు కొట్టారు. అంతటితో ఆగకుండా కొడుకును క్రమశిక్షణలో పెట్టుకోవాలంటూ దుర్భాషలాడారు. ఈ ఘటనతో తీవ్ర మనస్తాపం చెందిన సంజీవ ఇంటికి వెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నం చేసుకున్నాడు. అపస్మారకస్థితిలో ఉన్న అతణ్ని స్థానికులు జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఏలూరు ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు.