మా వాడి ముందే తొడగొడతావా, కాస్కో ఇక..

భారత్, విండీస్ మధ్య జరుగుతున్న నాలుగో వన్డేలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ 38 పరుగుల వద్ద కీమో పాల్ వేసిన బంతిని బౌడంరికి చేర్చే క్రమంలో క్యాచ్ అవుటయ్యాడు. ఆ సమయంలో పాల్ తొడగొట్టడంతో ధావన్ అభిమానులంతా షాక్‌కు గురయ్యారు. .Telugu News : West Indies Cricketer Keemo Paul Challenges To Team India Cricketer Shikhar Dhawan.. Rohit Sharma And Ambati Rayudu Fire సాధరణంగా ఫీల్డింగ్ సమయంలో క్యాచ్ పట్టిన ధావన్ తొడగొడుతూ  ఎగిరి గంతులేస్తూ సంబరం చేసుకుంటాడు.. కానీ ధావన్ వికెట్ తీసిన తర్వాత బౌలర్ కీమో పాల్ తొడగొడుతూ సంబరాలు చేసుకున్నాడు. ధావన్‌ను చూస్తూ రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు.. దానికి ధావన్  నవ్వుతూ పెవిలియన్‌కి వెళ్లిపోయాడు.. ఆ తర్వాత వచ్చిన రోహిత్, అంబటి రాయుడు ‘మా వాడి ముందే తొడగొడుతావా.. నీకు చుక్కలు చూపిస్తాం’.. అనే విధంగా పాల్‌ వేసిన ప్రతీ బంతిని బౌండరీకి పంపించారు. భారత్ బ్యాట్స్‌మెన్స్‌కు కోపం వస్తే ఎలా ఉంటుందో చూపించడంతో విండీస్ బౌలర్లు బిత్తరపోయారు.