ఆడోళ్లకు స్కూటర్లు ఇచ్చారని..  ఓ మగాడు ఏం చేశాడంటే.. - MicTv.in - Telugu News
mictv telugu

ఆడోళ్లకు స్కూటర్లు ఇచ్చారని..  ఓ మగాడు ఏం చేశాడంటే..

February 28, 2018

ప్రభుత్వం మీద కోపంతో ఓ వ్యక్తి విద్యుత్ టవర్ ఎక్కి ఆత్యహత్య యత్నానికి పాల్పడ్డాడు. మహిళలకు ప్రభుత్వం స్కూటర్లు ఇస్తోంది. మాకు ఆటోలు ఇస్తే ఏం పోయిందంటూ ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. పోలీసులు రంగప్రవేశం చేసి అతనికి ఆటో బహుమతిగా ఇచ్చి టవర్ కిందకు దించి, అతని ప్రాణాలకు కాపాడారు. ఈ ఘటన తమిళనాడులోని రామనాథపురం జిల్లా తండిరాదేవిపట్టిలో జరిగింది. తండిరాదేవిపట్టికి చెందిన మురుగన్‌ (34) ఆటోను బాడుగకు తీసుకుని నడుపుతుంటాడు. కొన్ని రోజుల క్రితం యజమాని ఆటోను విక్రయించటంతో తనకు పనిలేక మద్యానికి బానిసై తరచూ ఇంట్లో గొడవలు పెట్టుకుంటున్నాడు.అతడు మతిస్థిమితం కోల్పోయాడని కుటుంబ సభ్యులు అనుకుంటున్నారు. ఈ క్రమంలో మహిళలకు ప్రభుత్వం స్కూటర్లు ఇస్తున్న విషయం తెలిసిన మురుగన్ ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో కక్కాతోపు ప్రాంతంలోని 110 మెగావాట్ల సామర్థ్యం గల 60 అడుగులు ఎత్తున్న విద్యుత్‌ టవర్‌ ఎక్కి కేకలు పెట్టాడు. ఇది గమనించిన చుట్టుపక్కల వారు వెంటనే పోలీసు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే విద్యుత్‌ బోర్డు అధికారులు తూత్తుకుడి నుంచి కారైక్కాల్‌ వెళ్లే ఆ మార్గంలో విద్యుత్‌ను నిలిపివేశారు.

 అక్కడికి చేరుకున్న జిల్లా సహాయ సూపరిం టెండెంట్‌ సతీష్‌ కుమార్‌ మైకు ద్వారా మురుగన్‌తో మాట్లాడారు. ‘ ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నావు ? ’ అని ప్రశ్నించగా అసలు విషయం చెప్పాడు. ‘ మహిళలకు స్కూటర్లు అందిస్తున్న ప్రభుత్వం పురుషులకు ఆటోలు ఇవ్వాలి. లేదంటే ఏ ఆధారం లేని మాలాంటింవాళ్ళు ఎలా బతుకుతారు ? ’  అనటంతో పోలీసులు అప్పటికప్పుడు ఓ ఆటోను తీసుకొచ్చారు. దాన్ని తీసుకెళ్లమని విజ్ఞప్తి చేశారు.

తనకు నెంబరు లేని కొత్త ఆటో కావాలని, లేకపోతే కిందకు దూకి ఆత్మహత్య చేసుకుంటానని మురుగన్‌ బెదిరించసాగాడు. ఇంతలో టవర్‌ వెనుక పైపుగా ఎక్కిన అగ్నిమాపక సిబ్బంది మురుగన్‌ను పట్టుకుని సురక్షితంగా కిందకు చేర్చి, పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి విచారిస్తున్నారు.