బంగ్లా ఓటమిని తట్టుకోలేక ఈ అభిమాని ఏం చేశాడంటే... - MicTv.in - Telugu News
mictv telugu

బంగ్లా ఓటమిని తట్టుకోలేక ఈ అభిమాని ఏం చేశాడంటే…

March 20, 2018

వాళ్ళకు అభిమానం ఉప్పొంగినా ఆగరు.. ఆవేశం కట్టలు తెంచుకున్నా ఆగలేరు.. అదే అభిమానం.. అనటానికి ఇది ఉదాహరణ. ఓవైపు సినీహీరోల అభిమానులు, మరోవైపు క్రికెట్ అభిమానులు అప్పుడప్పుడు చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తుంటారు. ఇది అలాంటి సన్నివేశమే. తన అభిమాన బంగ్లాదేశ్ జట్టు భారత్ చేతిలో చిత్తుగా ఓడిపోయిందని నానా అల్లరి చేశాడు. నోరింత పెద్దగా చేసి అరిచి గీ పెట్టాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన ట్రై సిరీస్‌ టీ 20 సిరీస్‌ ఫైనల్లో భారత్‌ ఆఖరి బంతికి విజయం సాధించి కప్‌ను కైవసం చేసుకున్న విషయం తెలిసందే. ఆఖరి బంతికి దినేశ్‌ కార్తీక్‌ సిక్స్‌ కొట్టి భారత్‌కు విజయాన్ని అందించాడు.

తమ జట్టుకు భారత్ తీవ్ర నిరాశను మిగల్చడంతో ఈ బంగ్లా వీరాభిమాని అస్సలు జీర్ణించుకోలేకపోయాడు.  బంగ్లాదేశ్‌పై భారత్ గెలవడంతో తట్టుకోలేకపోయారు. ఇల్లు పీకి పందిరి వేసినంత పని చేశాడు. ముందున్న వస్తువునల్లా విసిరి పారేశాడు. క్షణాల్లో ఇల్లంతా చిందరవందర చేశాడు. సోఫాల్లో కూర్చున్న మిగతావారంతా అతని అరవటాన్ని చూసి నవ్వుకున్నారు. ఒక ఫ్రెండు ‘కూల్.. కూల్..’ అని ఓదార్చినా వినకుండా అదేపనిగా అరిచాడు. సోఫా మీద దుమికాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓవైపు భారత్ అభిమానులు ఆనందం కొద్ది సంబురాలు చేసుకుంటున్నారు. మరోవైపు ఇలాంటి అభిమానులు తమ జట్టు ఓడిపోయిందని ఆక్రోషంతో ఊగిపోతున్నారు.