మా ఇంట్లోవారికి లేని అభ్యంతరం మీకెందుకు? రకుల్ - MicTv.in - Telugu News
mictv telugu

మా ఇంట్లోవారికి లేని అభ్యంతరం మీకెందుకు? రకుల్

February 15, 2018

‘మా అమ్మానాన్నలకే లేని అభ్యంతరం… మీకెందుకు ? ’ అని తనపై అనుచిత వ్యాఖ్యలు చేసినవారిపై గుర్రుమంది పంజాబీ ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్. ‘మ్యాగ్జిమ్’ మేగజీన్ కవర్ పేజీ కోసం రకుల్ బికినీలో హాట్‌హాట్‌గా ఫొటోషూట్‌లో పాల్గొంది. ఒక్కసారిగా రకుల్ ఇలా కనిపించేసరికి హర్ట్ అయిన ఆమె అభిమానులు సోషల్ మీడియాలో ఆమెపై విరుచుకుపడ్డారు.

ఈ విషయమై ఇండియాటుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రకుల్ స్పందించింది. ‘ఏ హీరోయిన్‌కైనా తన కెరియర్లో ఒక్కసారన్నా ఆ మేగజీన్ కవర్‌పై తన ఫోటో చూసుకోవాలని వుంటుంది. నాకా అవకాశం వచ్చింది. దాన్ని వాడుకున్నాను అంతే. దానికింత రాద్ధాంతం చేయటం దేనికి? ఈ విషయంలో నా అమ్మానాన్నలే ఏమీ అనలేదు. మీరెవరు నన్ను అనటానికి ? అయినా పాజిటివ్ కామెంట్లకు పొంగిపోవటం – నెగెటివ్ కామెంట్లకు బాధపడే నైజం నాది కాదు. నా మనసుకు నచ్చిన పని నేను చేస్తాను. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా నేను పట్టించుకోను ’ అని హాట్‌గా సమాధానం చెప్పింది రకుల్.ప్రస్తుతం హిందీలో ‘అయ్యారీ ’ చిత్రంలో నటిస్తూ బాలీవుడ్‌లో తన బెర్త్‌ను పటిష్టం చేసుకునే యోచనలో వుంది రకుల్. తెలుగులో ఇంతవరకు ఒక్క కొత్త సినిమా కూడా ఒప్పుకోలేదు.. కారణం  ఏంటని అడిగితే సరైన కథలు దొరకటం లేదని చల్లగా చెప్పింది.