mictv telugu

సాయి మహిమ!  ట్రక్కు కిందపడినా బతికింది..

January 7, 2019

నమ్ముకున్న దేవుడే తనను ప్రాణాపాయం నుంచి కాపాడాడు అంటోంది ఓ మహిళ. దేవుడికి దండం పెట్టుకుంటుండగా ఆమె మీద నుంచి ట్రక్కు వెళ్లినప్పటికీ స్వల్ప గాయాలతో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. ఈ ఘటన సూరత్‌లోని ఉదానా ప్రాంతంలో ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. 55 ఏళ్ళ ఓ పారిశుద్ధ్య కార్మికురాలు గుడి ముందు రోడ్డు మీద నిలబడి, చెప్పులు విప్పి చేతులు జోడించి దేవుడికి దండం పెట్టుకుంటోంది.  ఇంతలో అక్కడికి వచ్చిన చెత్తను తరలించే మున్సిపాలిటీ మినీ వ్యాన్ రివర్స్‌లో వచ్చి ఆమెను ఢీ కొట్టింది. వెనకాల ఆమె వున్న విషయాన్ని గ్రహించని డ్రైవర్ వాహనాన్ని అలాగే పోనిచ్చాడు.

దీంతో ఆమె వ్యాన్ కింద పడిపోయింది. ఆమె మీదనుంచి వ్యాన్ వెళ్లిపోయింది. అయినా ఆమె సురక్షితంగా ప్రాణాలతో బయటపడింది. ప్రమాదానికి గురైన మహిళను పారిశుద్ధ్య కార్మికురాలైన రమీలా సోలంకిగా గుర్తించారు. ఈ ఘటన మొత్తం సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యింది. తన మీదనుంచి మినీ వ్యాన్ వెళ్లినప్పుటికీ తాను ప్రాణాలతో బయటపడినందుకు ఆనందం వ్యక్తం చేస్తోంది రమీలా. ఇది తనకు సాయిబాబా పెట్టిన ప్రాణభిక్ష అంటోందామె. క్రింది లింకులో వీడియో చూడొచ్చు.

Telugu news What on escape for this woman in surat! See it to believe it!