నానిపై  శ్రీరెడ్డి ఆరోపణలు.. పబ్లిసిటీ కోసమేనా? - MicTv.in - Telugu News
mictv telugu

నానిపై  శ్రీరెడ్డి ఆరోపణలు.. పబ్లిసిటీ కోసమేనా?

April 5, 2018

‘ నువ్వు చాలా మంది అమ్మాయిలను వాడుకున్నావు. వాళ్ళు ఇప్పటికీ ఏడుస్తున్నారు ’ అంటూ శ్రీరెడ్డి మరో హీరో గురించి తన ఫేస్‌బుక్‌లో లీక్ చేసింది. కాకపోతే తను ఎవరి గురించి అంటోంది అన్నది పేరు మెన్షన్ చేయకుండా కొన్ని హింట్స్ ఇస్తూ చెప్పింది. సింగర్ శ్రీరామచంద్ర గురించి పోస్ట్ పెట్టి ఒకరోజు గడవక ముందే ఇలా ఇంకో హీరో గురించి పోస్ట్ పెట్టి సంచలనానికి తెరలేపింది శ్రీరెడ్డి. ఆ హీరో ఎవరా అని టాలీవుడ్ ఇండస్ట్రీ యావత్తు జుట్టు పీక్కునేలా చేసింది.

పోస్ట్‌లో .. ‘ రియల్ లైఫ్‌లో నువ్వు  చాలా బాగా నటిస్తావు. ఆన్‌స్క్రీన్‌లో చాలా నేచురల్‌గా చేస్తావు, కనిపిస్తావు. కానీ అది నీ మాస్క్. నీ అసలు రూపం వేరేలా వుంటుంది. లైఫ్‌లో చాలా స్ట్రగుల్స్ తిన్నానని అంటావ్. అది జనాల నుంచి సానుభూతి పొందటానికే అని తెలుస్తోంది. నీకన్నా వారసత్వంగా తాతలు, తండ్రుల సపోర్ట్ తీసుకొని వచ్చిన హీరోలే నయం. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేష్ బాబులను చూసి నేర్చుకో. వారెవ్వరికీ గర్వం లేదు గానీ నువ్వు చాలా ఆటిట్యూడ్ చూపిస్తావ్. నువ్వు చిన్న డైరెక్టర్లను, ఇప్పుడిప్పుడే ఫీల్డుకు వస్తున్నవాళ్ళను అస్సలు గౌరవించవు.

దుర్భుద్దితో నీవు సక్సెస్ అయ్యావు. ఈ మధ్యే నీకు కొడుకు పుట్టాడు. అందుకు అభినందనలు. జీవితంలో కేర్‌ఫుల్‌గా ఉండు. నీ బారిన పడ్డ అమ్మాయిలు ఇంకా క్షోభ అనుభవిస్తున్నారు. భగవంతుడెప్పుడూ న్యాయం వైపే వుంటాడు. నిన్ను శిక్షించటానికి కొంచెం టైం పడుతుంది. నువ్వూ బాధపడే రోజు వస్తుంది. తప్పకుండా ఇండస్ట్రీ నుంచి ఇబ్బందులు ఎదురుకుంటావ్. ఇండస్ట్రీ నుంచి ఇలాంటివి ఈకలా రాలిపోవాలి ’ అంటూ పోస్ట్ పెట్టింది శ్రీరెడ్డి. హీరో నాని మీదే శ్రీరెడ్డి ఈ పోస్ట్ పెట్టిందని కామెంట్లు చేస్తున్నారు. ఆమె కేవలం పబ్లిసిటీ కోసం ఇలాంటి ఆరోపణలు చేస్తోందని, ఆధరాల్లేకుండా ఇలా పరువు తీయడం సరికాదని అంటున్నారు.

 

https://www.facebook.com/iamsrireddy/posts/2087034221543499