ఇక ఎవరికైనా డబ్బులు పంపించాలంటే ఇప్పుడు మరింత సులభం. ఎందుకంటే వాట్సప్‌లో పేమెంట్ ఫీచర్ వచ్చేసింది. ఇకపై మనీట్రాన్స్ ఫర్ చెయ్యాలంటే కేవలం వాట్సప్ ఓపెన్ చేస్తే సరిపోతుంది. మీబ్యాంక్ అకౌంట్‌ని యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్ (UPI) లింక్ చేస్తే చాలు. ఆ తర్వాత వాట్సప్’లోకి వెళ్లి పేమెంట్ ఫీచర్ ద్వారా ఎవరికి డబ్బు పంపివ్వాలనుకుంటున్నారో వారికి నంబర్ పై క్లిక్ చేస్తే చాలు..డబ్బు సులభంగా పంపించవచ్చు.ఈ కొత్త ఫీచర్ ఎంపిక చేసిన IOS, ఆండ్రాయిడ్ వాట్సాప్ బీటా యూజర్లకు అందుబాటులో ఉంది. ఈరోజుల్లో పెరుగుతున్న డిజిటల్ పేమెంట్లను దృష్టిలో పెట్టుకుని వాట్సప్ ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. మనీ పంపించడం, రావడం జరగాలంటే డబ్బులు పంపేవారికి, స్వీకరించే వారికి ఇద్దరికీ కచ్చితంగా వాట్సాప్ ఆఫర్ చేసే పేమెంట్స్ ఫీచర్ తప్పనిసరిగా ఉండాలి.