భారత్‌లో వాట్సాప్‌కు బాస్ కావాలి.. ఈ అర్హతలుండాలి… - MicTv.in - Telugu News
mictv telugu

భారత్‌లో వాట్సాప్‌కు బాస్ కావాలి.. ఈ అర్హతలుండాలి…

April 11, 2018

మెసేజింగ్ యాప్ వాట్సాప్‌ను ప్రపంచవ్యాప్తంగా 130 కోట్ల మంది వినియోగిస్తున్నారు. ఒక్క భారత్‌లోనే దాదాపుగా 20 కోట్ల మందికి ఇది లేకపోతే దిక్కు తోచదు. అందుకే దేశంలో వాట్సాప్ మార్కెట్  విస్తరిస్తోంది.ఈ నేపథ్యంలో భారత్‌లో తమ విభాగ బాధ్యతలను చూసుకునేందుకు బాస్ కావాలని ప్రకటించింది కంపెనీ. బాస్ ముంబై కేంద్రంగా పని చేయాల్సి ఉంటుంది. భారత్‌కు సంబంధించిన కంపెనీ వ్యవహారాలను కాలిఫోర్నియాలోని కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌కు రిపోర్ట్ చేయాలి. కనీసం 15 ఏళ్ల పాటు ఉత్పత్తుల కంపెనీలను నడిపించిన అనుభవం, పేమెంట్ టెక్నాలజీ కంపెనీల్లో 5 ఏళ్ల అనుభవం ఉండాలట.

‘భారత్‌లో వాట్సాప్ నుంచి చేపట్టిన ఉత్పత్తులు, వ్యాపారం, పీర్ టు పీర్ పేమెంట్స్ వంటి  ప్రణాళికలను ముందుండి నడిపించే అసాధారణ వ్యక్తి కోసం చూస్తున్నాం. ఇది సీనియర్ నాయకత్వ పదవి. ఉత్పత్తుల అనుభవంతోపాటు, వ్యాపారాలను విజయవంతంగా నడిపించిన ట్రాక్ రికార్డు ఉండాలి’అని వాట్సాప్ సంస్థ పేర్కొంది.