వాట్సాప్‌‌‌లో కొత్త ఫీచర్... - MicTv.in - Telugu News
mictv telugu

వాట్సాప్‌‌‌లో కొత్త ఫీచర్…

March 5, 2018

వాట్సాప్‌ వినియోగదారులకు ఇటీవల ‘డిలీట్‌ ఫర్‌ ఎవ్రీవన్‌‌’  అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. వాట్సాప్‌లో మనం పొరబాటుగా అనవసరమైన మెసేజ్‌లను ఇతరులకు పంపిస్తే వారు చూడకముందే వాటిని తొలగించే సదుపాయం కల్పించింది. ప్రస్తుతం ఇలా మెసేజ్‌లను డిలీట్‌ చేయాలంటే ఏడు నిమిషాల(420 సెకన్లు) లోపే డిలీట్ చేయాలి. అయితే ఈ ఫీచర్‌ను వాట్సాప్‌ అప్‌డేట్‌ చేసింది. మెసేజ్‌లను 7 నిమిషాల్లోపే కాకుండా గంట తర్వాత కూడా డిలీట్‌ చేసుకునేలా అప్‌డేట్  చేశారు.మనం పంపించిన మెసేజ్‌లను 68 నిమిషాల 16 సెకన్లలోపు వరకు డిలీట్‌ చేసుకోవచ్చు. అయితే ప్రస్తుతానికి  ఈ అప్‌డేటెడ్‌ ఫీచర్‌ ఆండ్రాయిడ్‌ బీటా వెర్షన్‌ ఫోన్లలో మాత్రమే అందుబాటులోకి వచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఐఫోన్‌ యాప్‌లలోనూ తీసుకురావాలని వాట్సాప్‌  ప్రయత్నిస్తోంది. వాట్సాప్ ఫార్వర్డ్‌ మెసేజ్‌ ఫీచర్‌ను కూడా పరీక్షిస్తోంది.  ఒక మెసేజ్‌ను అదే ఛాట్‌లో లేదా ఇతర ఛాట్‌ల నుంచి ఫార్వర్డ్‌ చేసినట్లయితే ఆ మెసేజ్ పైన ‘ఫార్వర్డెడ్‌ మెసేజ్‌’ అని వస్తుంది.