వాట్సాప్ ఓపెన్ కావాలంటే వేలిముద్ర వేయాల్సిందే.. - MicTv.in - Telugu News
mictv telugu

వాట్సాప్ ఓపెన్ కావాలంటే వేలిముద్ర వేయాల్సిందే..

January 9, 2019

ప్రపంచ ప్రఖ్యాత మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌లో మరి కొన్ని అద్భుతమైన ఫీచర్లు రాబోతున్నాయి. సోషల్‌ మీడియాలో డేటా చోరీ వార్తలు భయపెడుతున్న తరుణంలో వాట్సాప్‌ ఒక సరికొత్త ఫీచర్‌ను త్వరలోనే ప్రవేశపెట్టనుంది. వాట్సాప్‌ వినియోగదారుల సంభాషణలు ఇతరులు చూడకుండా కాపాడేందుకు ఆండ్రాయిడ్‌ వెర్షన్‌లో వాట్సాప్‌కు ఫింగర్‌ ప్రింట్‌ అథెంటికేషన్‌ ఆప‍్షన్‌ తీసుకురానుంది. ఇకపై వాట్సాప్‌ యాప్‌ను ఓపెన్‌ చేయాలంటే వేలిముద్ర అవసరమని మంగళవారం వెల్లడైన ఓ నివేదికలో తేలింది. దీనితో పాటు ఫోన్ బ్రైట్‌నెస్ వలన కళ్ళకు నష్టం కలుగకుండా ఉండేందుకు డార్క్‌మోడ్‌ని కూడా ప్రవేశపెట్టనుందట.ఫేస్‌బుక్‌ సొంతం చేసుకున్న వాట్సాప్ తీసుకురానున్న ఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్‌ ఫీచర్‌ ప్రస్తుతం ప్రయోగ దశలో ఉంది. ఈ ఫీచర్‌ నిర్దిష్ట చాట్ సంభాషణలను కాపాడటమే కాదు, మొత్తం యాప్‌కు భద్రత నిస్తుందనీ, ఇతరులకు మన వాట్సాప్‌ యాక్సెస్‌ చేయకుండా నియంత్రిస్తుందనీ.. అంటే వాట్సాప్‌లో మన చాటింగ్‌కు స్పెషల్‌గా లాక్‌ పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా.. డైరెక్టుగా యాప్‌కే ఫింగర్‌ ప్రింట్‌ ఫీచర్‌ రక్షణనిస్తుందని సాంకేతిక నిపుణులు వెల్లడిస్తున్నారు.Telugu News WhatsApp reportedly testing fingerprint authentication feature, revamped Audio Picker option