వాట్సాప్‌లో మరో మూడు కొత్త ఫీచర్లు - MicTv.in - Telugu News
mictv telugu

వాట్సాప్‌లో మరో మూడు కొత్త ఫీచర్లు

December 11, 2017

వాట్సాప్‌లో త్వరలో మరిన్ని కొత్త ఫీచర్లు రానున్నాయి. ఇప్పటికే వీడియో కాలింగ్, వాయిస్ కాలింగ్, స్టేటస్ వంటి తదితర ఫీచర్లు ఉన్నాయి.  ఈ మధ్యనే డిలీట్ ఆప్షన్  కూడా వచ్చింది. కొత్తగా వస్తున్న వాటిలో  ట్యాప్ టు అన్‌బ్లాక్, షేక్ టు రిపోర్ట్, ప్రైవేట్ రిప్లైస్  ఉన్నట్లు కంపెనీ తెలిపింది.

ట్యాప్ టు అన్ బ్లాక్..

వాట్సాప్‌లో ఎవరినైనా  బ్లాక్ చేయాలంటే సెట్టింగ్స్‌లోని ప్రైవసీ ఆప్షన్‌లో వెళ్లి బ్లాక్ చేయాలి. ఆ తర్వాత  ఆ నంబరును అన్ బ్లాక్ చేయాలంటే, మళ్లీ సెట్టింగ్స్‌లోని ప్రైవసీ ఆఫ్షన్‌లోకి వెళ్లాలి. కానీ ఈ ట్యాప్‌లు అన్‌బ్లాక్  ఆఫ్షన్‌తో కేవలం నంబరుపై ట్యాప్ చేస్తే బ్లాక్ అవుతుంది. మళ్లి ట్యాప్ చేస్తే అన్ బ్లాక్ అవుతుంది.

షేక్ టు రిపోర్ట్..

కొన్ని సార్లు వాట్సాప్‌లో సాంకేతిక సమస్యలు ఏర్పడితే ఒక్కసారిగా మెసేజ్‌లు వెళ్లవు, రావు. వాటి గురించి మన కాంటాక్ట్  లిప్ట్‌లో ఉన్న వారికి తెలియజేయాలంటే , జస్ట్ మన ఫోన్‌ను షేక్ చేస్తే చాలు. కాంటాక్ట్  లిస్ట్ ఓపెన్ అయ్యి ఓ ఆప్షన్ వస్తుంది. అందులో  సమస్య ఏమిటో వివరించి అందరికి ఒకేసారి  పోస్ట్  చేస్తే చాలు.

ప్రైవేట్ రిప్లైస్..

వాట్సాప్‌లో మనం గ్రూప్ మెసేజ్‌లు చేస్తుంటాం. గ్రూప్‌లో ఉన్న వారు ఏ మెసేజ్ చేసినా అది అందరికీ  వెళుతుంది. ప్రైవేట్‌గా మెసేజ్ పంపాంలంటే మళ్లీ వేరుగా కాంటాక్ట్ ఓపెన్ చేసి మెసేజ్ చేయాలి. అలా కాకుండా గ్రూప్‌లో‌నే ఉండి మనం మెసేజ్‌లు చేయేచ్చు. మనం మెసేజ్ పంపాలనుకునే వ్యక్తికి   మెసేజ్ టైప్ చేసి సెట్టింగ్స్‌లో ఉండే ప్రైవెట్ రిప్లై ఆప్షన్  నొక్కితే చాలు. మనం అనుకున్న వ్యక్తికి గ్రూప్‌లో కూడా ప్రైవేట్‌గా మెసేజ్ వెళుతుంది.

ఈ కొత్త ఫీచర్లన్నీ ప్రస్తుతం టెస్టింగ్‌ దశలో ఉన్నాయి. అయితే వాట్సాప్‌ వెబ్‌ 2.7315 వెర్షన్‌లో కేవలం ప్రైవేట్‌ రిప్లైస్‌, పిక్చర్‌ ఇన్‌ పిక్చర్‌ ఆప్షన్లు మాత్రమే అప్‌గ్రేడ్‌ అవుతాయి. 2.17.424, 2.17.436, 2.17.437 వెర్షన్లలో ట్యాప్‌ టు అన్‌బ్లాక్‌, న్యూ ఇన్‌వైట్‌ వయా లింక్‌, షేక్‌ టు రిపోర్ట్‌ ఆప్షన్లు ఆప్‌గ్రేడ్‌ అవుతాయి.