ఇక ‘వాట్సాప్ పే’ - MicTv.in - Telugu News
mictv telugu

ఇక ‘వాట్సాప్ పే’

October 31, 2017

వాట్సాప్‌లో సరికొత్త ఆప్షన్‌ రానున్నది. చాలా రోజులుగా ఈ ఆప్షన్‌ను తీసుకురావడానికి కసరత్తులు చేసింది వాట్సాప్. ఎట్టకేలకు దీన్ని అతి త్వరలోనే ప్రారంభించనున్నది. దీని పేరు వాట్సాప్ పే ఆప్షన్. దీని ద్వారా యూజర్లు సులభంగా ఫండ్ ట్రాన్స్‌ఫర్స్ చేసుకోవచ్చు.

ఈ కొత్త ఫీచర్‌ను తొలిసారి భారత్‌లోనే ప్రారంభించనున్నట్లు వాట్సాప్ ప్రకటించింది. పేటీఎమ్‌, ఎస్‌బీఐ బడ్డి, మొబిక్విక్‌లానే సులువుగా దీన్ని వాడొచ్చంటున్నారు. కాకపోతే ఇది వాడుకలోకి వస్తే వాటికి కోలుకోలేని దెబ్బ తగిలే అవకాశముంది. ముఖ్యంగా బాగా వాడకంలో వున్న పేటీఎమ్‌కే గట్టి దెబ్బ తగలనుందని భావిస్తున్నారు. ఈ ఫీచర్ వాట్సాప్ చాట్‌లో అటాచ్‌మెంట్ ఆప్షన్ కింద రూపీ సింబల్‌తో  రానున్నది. ఈ యూపీఐ ఆధారిత పేమెంట్ ఫీచర్ కోసం వాట్సాప్ ఇప్పటికే ఎస్‌బీఐ, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులతో ఒప్పందం కుదుర్చుకుంది.

ప్రస్తుతం ఈ ఫీచర్ ఫైనల్ టెస్టింగ్‌లో ఉంది. అది సక్సెస్ అనిపిస్తే వెంటనే లాంచ్ చేస్తారు. ఈ ఆప్షన్‌ను చాట్ స్క్రీన్ నుంచి బయటకు వచ్చి పేమెంట్స్ చేయాల్సిన అవసరం లేదు. అటాచ్‌మెంట్ ఆప్షన్ కిందే రూపీ సింబల్ ఉంచుతున్నట్లు వాట్సాప్ ప్రకటించింది. దీని ద్వారా ఫ్రెండ్స్‌కు ఒకే స్టెప్పులో ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ చేసుకొనే వెసులుబాలు వుంటుంది. అమౌంట్, యూపీఐ పిన్ ఎంటర్ చేస్తే చాలు. ఇప్పటికే వాట్సాప్‌కు పోటీగా ఉన్న వీచాట్‌లో పేమెంట్ ఆప్షన్ లాంచ్ అయింది.