బిడ్డ కోసం పక్కా ప్లాన్ చేసుకున్నాం.. సమంత - MicTv.in - Telugu News
mictv telugu

బిడ్డ కోసం పక్కా ప్లాన్ చేసుకున్నాం.. సమంత

April 11, 2018

అక్కినేని కోడలు అయినప్పటి నుంచి సమంత ప్రపంచం చైతూనే అయిపోయాడు. సినిమాలు తగ్గించుకున్పప్పటికీ సమంతకు అవకాశాలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా వుండే సమంత తన పర్సనల్ విషయాలు కూడా పంచుకుంటుంటుంది. అటు ఇంటి బాధ్యతలు ఇటు సినిమాలను బ్యాలన్స్ చేసుకుంటూ పోతోంది సమంత. తాజాగా సమంత తనకూ తల్లి అవాలని వుందని సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది.చైతూ భార్యగా, అక్కినేని కోడలుగా రావడం ఆనందంగా ఉంది. ఈ జన్మకు నాకిది పెద్ద బహుమతి.  ప్రతి వ్యక్తి జీవితంలో ప్రేమ, పెళ్లి అనేవి చాలా ముఖ్యమైనవి అంటారు. ప్రస్తుతం చైతుతో వైవాహిక జీవితం చాలా సంతోషంగా ఉంది. నాకూ ఇక తల్లి కావాలని ఉంది. మాతృత్వపు మధురిమలు చవి చూడాలని వుంది. ఈ విషయంలో చైతూ,నేను పేరెంట్స్‌గా మార‌డానికి డేట్ ఫిక్స్ చేసుకున్నాం. పిల్లల విషయంలో మేం చాలా క్లారిటీతో ఉన్నాం. ఆ టైం ప్ర‌కార‌మే నేను త‌ల్లిన‌వుతాను. త‌ల్లినైన త‌ర్వాత నా ప్రపంచంలోకి బేబీ కూడా వచ్చేస్తుంది ’ అని పోస్ట్ పెట్టింది సమంత. దేవతైనా, హీరోయిన్ అయినా తల్లి అవటం కోసం ఆడది అన్న ప్రతి ఒక్కరు ఆరాటపడవలసిందే.. అందుకు సమంత మినహాయింపు కాదని కామెంట్లు చేస్తున్నారు.