mictv telugu

ఎక్కడి ఉద్యోగులు అక్కడే..

February 13, 2019

రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయాక విద్యుత్తు ఉద్యోగుల పంచాయతీలు ఇంకా కొనసాగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఉద్యోగులు తెలంగాణలోనే, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగులు ఆంధ్రప్రదేశ్‌లోనే పనిచేసేలా చూడాలని తెలంగాణ విద్యుత్తు ఇంజనీర్లు జస్టిస్‌ ధర్మాధికారి కమిటీకి వినతిపత్రం అందించారు.

Telugu news Where are the employees.

తెలంగాణ విద్యుత్తు ఇంజినీర్ల సంఘం అధ్యక్షులు శివాజీ, విద్యుత్తు అకౌంట్స్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి అంజయ్య ఆధ్వర్యంలో బృందం కమిటీని కలుసుకుంది. విద్యుత్తు ఉద్యోగుల విభజనపై సుప్రీంకోర్టు ఏర్పాటుచేసిన ఆ కమిటీ విజయవాడలో సమావేశమైంది. ఆంధ్రప్రదేశ్‌ ఉద్యోగులను తెలంగాణకు కేటాయించరాదని వినతిపత్రంలో కోరామని తెలిపింది. Telugu news Where are the employees