mictv telugu

‘హెల్మెట్’గవర్నర్‌కు వ్యతిరేకంగా సీఎం ధర్నా

February 13, 2019

మోటార్ సైకిల్ నడపడానికి హెల్మెట్ తప్పనిసరి చేస్తూ పుదుచ్చేరి లెఫ్టునంట్ గవర్నర్ కిరణ్ బేడీ ఆదేశాలు జారీచేసిన సంగతి తెలిసిందే. అయితే ఆమె తీసుకున్న నిర్ణయంపై పుదుచ్చేరి ముఖ్యమంత్రి వి.నారాయణ స్వామి వ్యతిరేకత వ్యక్తం చేస్తూ రాజ్ భవన్ ఎదుట క్యాబినెట్ మంత్రులతో కలిసి ధర్నాకు దిగారు. నల్ల దుస్తులు ధరించిన ముఖ్యమంత్రి కిరణ్ బేడీ తీసుకున్న నిర్ణయాన్ని రీకాల్ చేయాలని కోరారు.

మోటార్ సైకిల్స్ నడవడానికి హెల్మెట్‌ను త‌ప్ప‌నిస‌రిగా ధ‌రించాల‌ని డీజీపీ ఆదేశించిన‌ నియ‌మావ‌ళిని ద‌శ‌ల‌వారీగా అమ‌లు చేయాల‌ని సీఎం కోరారు. త‌మ నిర‌స‌న‌ను శాంతియుతంగా తెలియ‌జేస్తున్నామ‌ని ఆయ‌న అన్నారు. లెఫ్టనంట్ గ‌వ‌ర్న‌ర్ కిర‌ణ్ బేడీ.. సోమ‌వారం త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో ఓ వీడియోను పోస్టు చేశారు. రోడ్డుపై హెల్మెట్ లేకుండా వెళ్తున్న టూవీల‌ర్స్‌ను ఆమె ఆపేశారు. హెల్మెట్లు ధ‌రించాలంటూ ఆమె వారికి వార్నింగ్ ఇచ్చారు. అయితే వాహ‌న‌దారుల ప్రాణ ర‌క్ష‌ణ కోసం గ‌వ‌ర్న‌ర్ తీసుకున్న నిర్ణ‌యాన్ని.. సీఎం నారాయ‌ణ‌స్వామి వ్య‌తిరేకించ‌డం అర్థంలేని పని అని కొందరు అభిప్రాయపడుతున్నారు.Telugu News  “Where’s Your Helmet?” Kiran Bedi Turns Traffic Cop, Stops Motorists