వైట్ హౌస్ కాదు. .ర్యాట్ హౌస్! - MicTv.in - Telugu News
mictv telugu

వైట్ హౌస్ కాదు. .ర్యాట్ హౌస్!

December 2, 2017

ఎలుకలు, బొద్దింకలు, చీమల బెడద సామాన్యుల ఇళ్లకే కాదు అమెరికా శ్వేతసౌధానికి కూడా వున్నట్టు సమాచారం.  ఈ నిజం ఇటీవ‌ల 2017 వ‌ర్కింగ్ ఆర్డ‌ర్ల డాక్యుమెంట్ల ద్వారా బయట పడింది. అధ్యక్షుడి అధికారిక నివాసంలోని నాలుగు చోట్ల, చీఫ్ ఆఫ్ స్టాఫ్ జాన్ కెల్లీ కార్యాలయంలో చీమల బెడద వున్నట్టు తెలుస్తున్నది. అలాగే నావీ మెస్‌లో, సిట్చువేషన్ గదిలో ఎలుకలు వీరవిహారం చేస్తున్నట్టు డాక్యుమెంట్లు చెబుతున్నాయి. అయితే వీటి నిర్మూలన జరగాలంటే శ్వేత సౌధంలో మరమ్మతులు జరగాలని అధికారులు యూఎస్ జనరల్ సర్వీసెస్ అడ్మినిస్ట్రేషన్ ( జీఎస్ఏ ) కి వందల సంఖ్యలో దరఖాస్తులు చేశారట. అయినా ఎవరూ పట్టించుకోవట్లేదని తెలుస్తోంది.  ఏజెన్సీ రికార్డుల ప్ర‌కారం వైట్‌హౌస్ మ‌రమ్మ‌తులు, నిర్వ‌హ‌ణ కోసం జీఎస్ఏ సంవ‌త్స‌రానికి ల‌క్ష డాల‌ర్లు ఖ‌ర్చు పెడుతున్న‌ట్లు తెలుస్తోంది. అయినా ఎక్కడి అసౌకర్యాలు అక్కడే వున్నాయనే వాదనలు వినిపిస్తున్నట్టు సమాచారం. వాషింగ్ట‌న్ డీసీలో ఉన్న 9000ల‌కి పైగా ప్ర‌భుత్వ భ‌వ‌నాల నిర్వ‌హ‌ణ‌ను జీఎస్ఏ ప‌ర్య‌వేక్షిస్తుంది.జాతీయ ర‌క్ష‌ణ స‌ల‌హాదారు హెచ్‌. ఆర్. మెక్‌స్ట‌ర్ గ‌ది మ‌ర‌మ్మ‌తు, మాజీ వైట్‌హౌస్ ప్రెస్ సెక్ర‌ట‌రీ షాన్ స్పైస‌ర్ గ‌దిలో కొత్త ఫ‌ర్నీచ‌ర్ కోసం, ఓవ‌ల్ ఆఫీస్‌లో కొత్త టాయ్‌లెట్ బేసిన్‌ కోసం ఆన్‌లైన్ ద్వారా జీఎస్ఏకు పంపే ఈ ఆర్డ‌ర్ డాక్యుమెంట్లలో పెట్టుకున్న ద‌ర‌ఖాస్తులు ఉన్నాయట.