ఇది శ్వేత నాగేనా..? - MicTv.in - Telugu News
mictv telugu

ఇది శ్వేత నాగేనా..?

November 26, 2017

శ్వేత నాగు పాముల గురించి మనం చాలా సార్లు విన్నాం. అయితే అలాంటి తెల్ల పాము ఒకటి వనపర్తి జిల్లాలోని పెబ్బేరు నుంచి కొల్లాపూర్ వెళ్లే ప్రధాన రహదారిపై ప్రత్యక్షమైంది. తెల్లపాము రోడ్డుపైకి వచ్చి పడగ విప్పడంతో ఆ రహదారిలో వెళ్లే అన్ని వాహనాలు ఆగిపోయాయి.

జనాలు దీనిని అరుదైన శ్వేత నాగు అంటూ ఫోటోలు తీసుకున్నారు. దాదాపు 20 నిమిషాలు ఆ పాము బుసలు కొట్టుకుంటూ రోడ్డుపైనే ఉంది. ఆతర్వాత మళ్లీ పొలాల్లోకి వెళ్లిపోయింది.