ఈ పాప ఎవరో గుర్తుపట్టారా? - MicTv.in - Telugu News
mictv telugu

ఈ పాప ఎవరో గుర్తుపట్టారా?

February 16, 2018

ప్రియా ప్రకాశ్ వారియర్.. ఇప్పుడు మీడియాలో ఎక్కువగా నాని చీలకలు పేలికలవుతున్న పేరు. ఆమెకు  సంబంధించిన ఫోటోలు, వ్యక్తిగత వివరాలను తవ్వి తీసే పనిలో చాలా మందే వున్నారు. ఆమెకున్న క్రేజును ఈ విధంగా చాలా మంది క్యాష్ చేసుకోవాలనుకుంటున్నారు. సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్‌ను తీసుకొచ్చారు.

క్యూట్ క్యూట్ చూపులు..  చిరునవ్వులు చిందిస్తున్న పాల బుగ్గల  చిన్నారి ఎవరో గుర్తుపట్టారా ? అంటూ సోషల్ మీడియాలో ప్రియకు సంబంధించిన చిన్నప్పటి ఈ ఫోటో చక్కర్లు కొడుతోంది. నటించిన సినిమా విడుదల కాకుండానే, చిన్న టీజర్ ద్వారా ఎక్కడలేని క్రేజ్‌ను సంపాదించుకుంది ప్రియ. ఈ ఫోటో తన ఇన్‌స్ట్రాగ్రామ్ పేజీ నుండే షేర్ అయింది. ఇన్‌స్ట్రాగ్రామ్‌లో తన ఫాలోవర్ల సంఖ్య 35 లక్షలకు మించిపోయింది. సోషల్ మీడియాలో ప్రతీ ఒక్కరు ప్రియకు సంబంధించిన ఆసక్తికర విషయాల గురించే వెతుకుతున్నారు.

కేవలం కనుసైగలతో ఇంత మందిని నేను మాయ చేశానా.. ’ అని తనను తానే నమ్మలేని సందిగ్ధంలో పడిందట. ఈ ఒక్క చిన్న వీడియోతో సోషల్ మీడియాలో తనకు ఊహించని విధమైన ఫాలోయింగ్ పెరగటంతో ఆనందాన్ని తట్టుకోలేకపోతోందట. కేరళ త్రిస్సూర్‌లోని ‘విమల కాలేజ్‌ ’లో బీకామ్‌ చదువుతున్న ప్రియ బహుముఖ ప్రతిభావంతురాలు. సంప్రదాయ మోహినీహట్టంలో కూడా ప్రియకు ప్రావీణ్యం వుంది. అందుకే అంత చక్కగా కళ్ళతో హావభావాలు పలకగలిగింది. ప్రస్తుతం      ‘ ఒరు అడార్ లవ్ ’ సినిమాలో నటిస్తోంది. అది వచ్చే నెల విడుదలకు సిద్ధమవుతోంది.