ఈ బాలుడి మరణానికి బాధ్యులెవరు ? - MicTv.in - Telugu News
mictv telugu

ఈ బాలుడి మరణానికి బాధ్యులెవరు ?

March 29, 2018

పిల్లల విషయంలో తల్లిదండ్రులు చాలా అప్రమత్తంగా వుండాలి. లేదంటే వారి మీదకు ఏ ప్రమాదం ఎక్కడినుంచి ముంచుకొస్తుందో తెలియని పరిస్థితులు నెలకొని వున్నాయి. స్కూలు బస్సు ప్రమాదాల్లో మాసాయిపేట ఘటన ఎందరినో కలిచివేసింది. అలాంటి ఘటనలు అక్కడా ఇక్కడా ఇంకా సంభవిస్తూనే వున్నాయి. అలాంటి ఓ బస్సు ప్రమాదానికి సంబంధించిన వీడియో ఇప్పుడు వాట్సాప్‌లో వైరల్‌గా మారింది. ఇంటి ముందుకు వచ్చిన స్కూలు బస్సులో తన అక్క వచ్చిందని ఆనందంగా చూడటానికి లోపలినుంచి వచ్చిన ఆ పసివాడు బస్సు చక్రాల కింద పడి మృత్యువాత పడ్డాడు. డ్రైవర్ నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. బస్సు వెనక వైపు నుంచి పోయినా ఆ పసివాడి ప్రాణాలు మిగిలేవి. తల్లిదండ్రులు ఇంట్లో పనుల్లో వుండగా ఈ ప్రమాదం జరిగింది. ముందు టైరు, వెనుక టైరు రెండూ ఎక్కటంతో క్షణాల్లో ఆ బాబు ప్రాణాలు గాల్లో కలిసాయి.పిల్లల విషయంలో ఇది ఖచ్చితంగా కన్నవాళ్ళ నిర్లక్ష్యానికి నిదర్శనం అంటున్నారు చాలా మంది. పిల్లల మీద ఎప్పటికీ తల్లిదండ్రులు ఒక నిఘా వేసి వుంచాలి. ముఖ్యంగా స్కూలు బస్సు వచ్చినప్పుడు తల్లిదండ్రులు పిల్లల దగ్గరుండి మరీ వారిని బస్సు ఎక్కించాలి. లేదంటే పసి ప్రాణాలు ఇలా గాల్లో కలుస్తాయి.