పవన్ పోలీస్ స్టేషన్‌కు ఎందుకు వెళ్ళలేదు.. సోషల్ మీడియాలో కామెంట్లు - MicTv.in - Telugu News
mictv telugu

పవన్ పోలీస్ స్టేషన్‌కు ఎందుకు వెళ్ళలేదు.. సోషల్ మీడియాలో కామెంట్లు

April 21, 2018

కాస్టింగ్ కౌచ్‌పై నటి శ్రీరెడ్డి పోరాడుతున్న సందర్భంలో నటుడు పవన్ కల్యాణ్ పోలీస్ స్టేషన్‌కు వెళ్ళాలని నీతులు చెప్పి.. తను మాత్రం ఎందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్ళకుండా ఫిలింఛాంబర్‌కు వెళ్ళాడని జనాలు చివాట్లు పెడుతున్నారు. ఈ విషయంలో శ్రీరెడ్డి పవన్‌ను అసభ్య పదజాలంతో తిట్టిన విషయం తెలిసిందే. కాగా ఈ విషయంలో టాలీవుడ్‌లో పెద్ద దూమారమే రేగుతోంది. చినికి చినికి గాలివానలా శ్రీరెడ్డి ఉద్యమానికి రాజకీయ రంగు పులుముకుంది. పవన్ ఫిలింఛాంబర్‌కు వచ్చి వెళ్లి ఏం మాట్లాడారో తెలీదు. అన్నపూర్ణ స్టూడియోలో మీటింగ్ పెడతామని చెప్పి భద్రతా కారణాలతో మీటింగ్ రద్దు చేశారు. కాగా పవన్ వ్యవహార శైలిపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. ఒక ఆడపిల్లను అడ్డు పెట్టుకుని పవన్ గేమ్ ప్లే చేస్తున్నారనే విమర్శలు గుప్పుమంటున్నాయి.ఇండస్ట్రీ అంటే కేవలం పవనే అన్నట్టు ఓవరాక్షన్ చేశారని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. కేవలం జనంలో తన పేరు నానాలనే పవన్ ఇలా చేస్తున్నారని అంటున్నారు. ఒకప్పుడు పవన్ తెలంగాణ ముఖ్యమంత్రిని కూడా తాట తీస్తా అని కేసీఆర్ పేరును ప్రస్తావిస్తూ అన్నప్పుడు ఈ ఫ్యాన్స్ అంతా ఎక్కడికి వెళ్ళారు? పవన్ కూడా ఈ విషయంలో అపాలజీ చెప్పలేదు కదా అంటున్నారు. శ్రీరెడ్డి, ఆర్జీవిలు ఇప్పటికే లక్షల సార్లు క్షమాపణలు చెప్పారు. అయినా ఆ విషయాన్నే పవన్ పట్టుకు వేళాడుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. శ్రీరెడ్డి లేవనెత్తిన సమస్య కాస్టింగ్ కౌచ్‌ను పక్కదారి పట్టిస్తున్నారని అంటున్నారు. పవన్ అభిమానులు సైకోల్లా మారి శ్రీరెడ్డిని, ఆర్జీవిని బండబూతులు తిడుతుంటే పవన్ మౌనం ఎందుకు వహిస్తున్నారని.. అభిమానులకు తాను కంట్రోల్ చెయ్యలేడా.. అని కామెంట్లు చేస్తున్నారు.