కేటీ‌ఆర్‌కు రేవంత్‌రెడ్డి సవాల్   - MicTv.in - Telugu News
mictv telugu

కేటీ‌ఆర్‌కు రేవంత్‌రెడ్డి సవాల్  

October 27, 2017

పెను సంచలనం సృష్టించి, తర్వాత సద్దమణిగిపోయిన డ్రగ్స్ వ్యవహారం గురించి శాసనసభలో ఎందుకు ప్రస్తావించడం లేదని రేవంత్ రెడ్డి తెలంగాణ సర్కారును  ప్రశ్నించారు. ఆయన శుక్రవారం అసెంబ్లీ ఆవరణలో మీడియా ముందు మాట్లాడుతూ ప్రభుత్వ వైఖరిని ఖండించారు.

ప్రశ్నోత్తరాల సమయంలో తాను డ్రగ్స్‌పై అడిగిన ప్రశ్నను కావాలనే ఆపారన్నారు. తీగ లాగితే డొంక కదులుతుందన్నట్టు డ్రగ్స్‌పై చర్చ జరిగితే ప్రభుత్వ పెద్దల బండారం బయట పడుతుందని.. అందుకే వాళ్ళు ఈ అంశం గురించి మాట్లాడలేకపోతున్నారని ఆరోపించారు.

డ్రగ్స్‌లో కేటీఆర్‌కు సంబంధం వుండబట్టే తాను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా మాట దాటవేశారని అన్నారు. హోంమంత్రి చేసిన ఆరోపణలను నిరూపించుకోవడానికి నేను సిద్ధమేనన్నారు. తన రక్త నమూనాలు, వెంట్రుకల ఇవ్వటానికి సిద్ధంగా వున్నానని.. ఇందుకు కేటీఆర్ కూడా సిద్ధంగా వున్నారా అని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. అసెంబ్లీలో ప్రభుత్వ తీరు ఏకపక్షంగా వుందని మండిపడ్డారు.