రాత్రెందుకు రిస్క్ అనుకున్నట్టున్నాడు… పగటిదొంగ అవతారమెత్తి… - MicTv.in - Telugu News
mictv telugu

రాత్రెందుకు రిస్క్ అనుకున్నట్టున్నాడు… పగటిదొంగ అవతారమెత్తి…

November 21, 2018

నిద్ర మానుకుని ఏ అర్థరాత్రో, అపరాత్రో దొంగతనాలు చేసే రిస్క్ ఎందుకు అనుకున్నట్టున్నాడు ఈ దొంగ. అందుకే పట్టపగలు దొంగతనానికి ఎగబడ్డాడు. చివరికి చిక్కి కటకటాల పాలయ్యాడు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలోని రామ్‌నగర్‌ ప్రాంతంలో మంగళవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… గ్రామానికి చెందిన జరుగుళ్ల లక్ష్మీనారాయణ మంగళవారం ఉదయం పొలం పనులకు వెళ్లాడు. పిల్లలు చదువుకోవడానికి బడికి వెళ్ళారు. లక్ష్మీ నారాయణ భార్య లక్ష్మి ఇంటికి తాళం వేసి గడ్డి కోసేందుకు పొలానికి వెళ్లింది. ఇంటిలో ఎవరూ లేకపోవడంతో ఇదే అదునుగా భావించాడు దొంగ. ఇంకే ఇంటికి వేసిన తాళం, గడియను ఇనుప బ్లేడు సాయంతో కోసి ఇంట్లోకి దూరాడు.Telugu news Why the night was going to risk ...Daytime robbery… The incident took place on Tuesday in Ramnagar area of Srikakulam district.ఇంట్లోని ఇనుప బీరువా తాళాలు సుత్తితో మోది విరగ్గొట్టాడు. బీరువాలో నగలు, నగదు కోసం అందులో వున్న బట్టలన్నీ చిందరవందర చేశాడు. నగదు దొరకలేదు కానీ లోపల అరలో ఉన్న రెండున్నర తుళాల బంగారు పుస్తెలతాడు, అరతులం బంగారు చెవి దుద్దులు దొరికాయి. వాటిని తీసుకుని వెళ్లిపోయాడు. గడ్డి కోసుకుని ఇంటికి వచ్చిన లక్ష్మి విరిగిన తాళం, చిందరవందరగా ఉన్న బీరువాను చూసి షాకైంది. వీధిలోకి వచ్చి చూడగా అక్కడా ఆ దొంగ అనుమానాస్పదంగా కనిపించాడు. అతడిని ‘ఎవరు నువ్వు’ అని ప్రశ్నించగా నీళ్లు నమిలాడు. పారిపోవడానికి ప్రయత్నించాడు. దీంతో అక్ష్మి అరిచింది. ఆమె అరుపులు విన్న స్థానికులు అతడిని పట్టుకున్నారు. బట్టలు ఊడదీసి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. అతడి జేబులో మూడు తులాల బంగారాన్ని పోలీసులు గుర్తించారు. నిందితుడిని విజయనగరం జిల్లా మక్కువకు చెందిన డి.విష్ణుకుమార్‌గా గుర్తించారు. అతని దగ్గరనుంచి బంగారాన్ని స్వాధీనం చేసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. దువ్వాడ, ఆనందపురం  ప్రాంతాల్లో జరిగిన చోరీల్లోనూ ఈ యువకుడి హస్తం వుందని పోలీసులు తమ విచారణలో తెలిపారు.