దారుణం… ఒకరిని విడిచి మరొకరు ఉండలేక... - MicTv.in - Telugu News
mictv telugu

దారుణం… ఒకరిని విడిచి మరొకరు ఉండలేక…

October 2, 2018

భార్యాభర్తల బంధం వీడిపోలేనిది అంటారు. భార్యని ప్రేమగా చూసుకునే భర్త.. భర్తే సర్వస్వం‌గా జీవించే భార్య.. అలాంటి ఓ ఇద్దరు భార్యభర్తలు ఒకరిని విడిచి ఒకరుండలేక అనంతలోకాలకు వెళ్లిపోయారు. హృదయవిదారకమైన ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లాలో చోటు చేసుకుంది.

Wife And Husband Committed Suicide In West Godavari District

జ్యోతి(27), విష్ణుమూర్తి(32) దంపతులు. వీరికి ఏడేళ్ల కొడుకు ఉన్నాడు. విష్ణుమూర్తి ఓ ప్రైవేటు వ్యాపార సంస్థలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నాడు. కొద్దిరోజుల క్రితం అతడు అనారోగ్యానికి గురయ్యాడు. ఎక్కువ రోజులు బతకడం కష్టమని వైద్యులు సూచించారు. దీంతో భర్త లేకపోతే తాను ఒంటరిగా బతకలేనని భావించిన భార్య జ్యోతి భర్తతోపాటు తాను కూడా చనిపోవాలని నిర్ణయించుకుంది. ఇద్దరూ సోమవారం గ్రామ శివారులోని వారి పొలంలోని బావి వద్దకు వెళ్లి పురుగుల మందు తాగారు. అనంతరం ఇద్దరు కలిసి బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందజేశారు.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను బయటకు తీయించారు. పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.