పెళ్లిరోజు శుభాకాంక్షలు చెప్పినందుకు షమీపై భార్య కేసు - MicTv.in - Telugu News
mictv telugu

పెళ్లిరోజు శుభాకాంక్షలు చెప్పినందుకు షమీపై భార్య కేసు

April 10, 2018

తమ మధ్య ఎన్ని వివాదాలు వున్నా విడాకులు వచ్చేవరకు భార్యాభర్తలమే అనుకున్నట్టున్నాడు టీమిండియా క్రికెటర్ మహమ్మద్ షమీ. నాలుగో పెళ్ళిరోజు సందర్భంగా ‘ మిస్ యూ ’ అంటూ భార్య హసీన్ జహాన్‌కు పెళ్ళిరోజు శుభాకాంక్షలు చెప్పాడు. కానీ అక్కడ షమీ భార్య హసీన్ పాజిటివ్‌గా స్పందించకుండా కోర్టును ఆశ్రయించిందని తెలుస్తోంది. భార్య అంటే తనకు ఇంకా ప్రేమ వుందని అనుకున్నాడు షమీ. కానీ హసీన్ మాత్రం అతని ప్రేమను అంగీకరించలేకపోయిందని సమాచారం.

భర్తను మరిన్ని ఇబ్బందుల్లోకి నెట్టే ప్రయత్నంలో ఉన్న ఆమె తాజాగా మంగళవారం కోల్‌కతాలోని అలీపూర్ కోర్టులో గృహహింస చట్టం కింద పిటిషన్ వేసింది. తనకు, తన కుమార్తెకు భరణం చెల్లించేలా షమీని ఆదేశించాలని పిటిషన్‌లో కోరింది. షమీ చెక్కుల ద్వారా డబ్బులు తీసుకుందామనుకున్న హసీన్‌కు అక్కడ చెక్కులు చెల్లలేవు. అతని చెక్‌లను బ్లాక్ చేయడంతో బ్యాంకులు డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించాయి. దీంతో ఆమె భరణం కోసం కోర్టును ఆశ్రయించారు.

 గత నెలలో హసీన్ షమీపై ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. షమీ తనను నిత్యం వేధింపులకు గురి చేస్తున్నాడని, హత్యాయత్నం కూడా చేశాడని కోల్‌కతా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అతడిపై గృహ హింస చట్టం కింద కేసు నమోదు చేశారు. షమీ మ్యాచ్ ఫిక్సింగ్‌కి పాల్పడ్డాడని, వేరే యువతులతో షమీకి అక్రమ సంబంధాలు వున్నాయని ఆరోపించింది. దీనిమీద సీబీఐ దర్యాప్తు చేపట్టింది. ఈ దర్యాప్తులో షమీ మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడలేదని తేల్చి తిరిగి అతని కాంట్రాక్ట్ పునరిద్ధరించింది. ప్రస్తుతం షమీ ఐపీఎల్‌లో ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు తరుపున ఆడుతున్నాడు.