వైఫై ఆఫ్ చేసిందని వైఫ్‌పై దాడి.. మార్చి 8నే ఘాతుకం - MicTv.in - Telugu News
mictv telugu

వైఫై ఆఫ్ చేసిందని వైఫ్‌పై దాడి.. మార్చి 8నే ఘాతుకం

March 8, 2018

మహిళా దినోత్సవం రోజైనా మహిళలను గౌరవిద్దాం అనే కాస్తంత ఇంగితజ్ఞానం కూడా లేకుండా ఓ శాడిస్ట్ భర్తకు. వైఫై‌ని ఆఫ్ చేసిందటూ ఆమెను తీవ్రంగా కొట్టాడు.  హైదరాబాద్‌లోని బాలానగర్‌లో ఈ ఘటన జరిగింది. ఇంట్లో వైఫై ఆఫ్ చేసిందని ఆగ్రహంతో ఊగిపోయిన మహ్మద్ ఒమర్ తన భార్య రేష్మ సుల్తానాను చితకబాదాడు. తీవ్రంగా గాయపడ్డ రేష్మాను సోమాజీగూడా యశోదా ఆసుపత్రికి తరలించారు. కంటి భాగంలో ఆమెకు తీవ్రగాయమైంది. బాధితురాలి తల్లిదండ్రులు అల్లుడి మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.కంటి బాగంలో తీవ్రంగా గాయపడ్డ భార్య సుల్తానా ,పోలీసులకు పిర్యాదు చేసిన బాధితురాలి తల్లితండ్రులు.