భార్యను చెట్టుకు కట్టేసి గొడ్డును బాదినట్టు బాదాడు.. వీడు మనిషేనా ? - MicTv.in - Telugu News
mictv telugu

భార్యను చెట్టుకు కట్టేసి గొడ్డును బాదినట్టు బాదాడు.. వీడు మనిషేనా ?

March 23, 2018

కట్టుకున్న భార్య మీద అనుమానంతో పశువులా మారాడు ఆ భర్త. భార్యను చెట్టుకు కట్టేసి గొడ్డును బాదినట్టు బాదాడు. చుట్టూ జనం కూడా అది తప్పు అని ఏ ఒక్కరు అనకపోగా వీడియోలు తీయటంలో మునిగిపోయారు. ప్రపంచం అందుకోలేనంత ఎత్తుకు ఎదుగుతున్నా మానవత్వంలో అందనంత లోతుకు కూడా దిగజారిపోతోంది అనటానికి ఇది నిలువెత్తు నిదర్శనం. విలవలు క్రమంగా అంతరించిపోతున్నాయి. అనుమానాలతో మనిషి తన నైజాన్ని మృగం కన్నా దుర్మార్గంగా మార్చుకుని ప్రవర్తిస్తున్నాడు. హైటెక్ టెక్నాలజీ వ్యవస్థలో ఇంకా పంచాయితీ అనే దురాచారం తొలగిపోలేదు. వూళ్ళల్లో అదింకా తన వికృతాన్ని ప్రదర్శిస్తోంది. పంచాయితీ పెద్దలు కర్కషంగా ఇచ్చిన తీర్పులో భర్త క్రూరమృగంలా భార్యపై అత్యంత పాశవికంగా దాడి చేశాడు. దారుణమైన ఈ ఘటన దేశరాజధాని ఢిల్లీకి 60 కిలోమీటర్ల దూరంలోనే జరిగింది.ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌ జిల్లాలో ఓ గ్రామం ఉంది. ఓ మహిళకు పరాయి పురుషుడితో అక్రమ సంబంధం వున్నట్టు భర్త ఆరోపించాడు. వూళ్ళో పెద్దలను కూర్చుండబెట్టి పంచాయితీ పెట్టించాడు. దాంతో ఓ వందమందికి పైగా ఓ చోట చేరి ఆమెను చెట్టుకు కట్టేసి కొట్టాలని శిక్ష విధించారు. వెంటనే ఆమె చేతులను తాడుతో చెట్టు కొమ్మకు కట్టేసి భర్త టైరు, ట్యూబుతో ఎటు పడితే అటు కసిదీరా కొట్టడం మొదలు పెట్టాడు. చుట్టూ వందమంది పురుషులు వున్నారు. ఏ ఒక్కరూ అలా చేయటం తప్పు అనలేదు. సరికదా చోద్యం చూసినట్టు చూస్తూ, ఎంటర్‌టైన్ అవుతూ వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఆ దెబ్బలకు తాళలేక ఆమె స్పృహకోల్పోయింది. సోషల్ మీడియాలో ఆ వీడియోను చూసిన పోలీసులు వేగంగా స్పందించారు. ఆమె భర్తను, పంచాయతీ చెప్పిన పెద్దలను అరెస్టు చేసి జైలుకు తరలించారు. మరో 25మందిపై కూడా కేసులు నమోదు చేశారు. ఆమెను ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు.

https://www.ndtv.com/video/news/news/woman-tied-to-tree-flogged-in-full-public-view-just-60-km-from-delhi-481308